• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ సంచ‌ల‌న భేటీల్లో...

ట్రంప్ సంచ‌ల‌న భేటీల్లో ఇది రెండ‌వ‌ది

By - Tupaki Desk
Update: 2018-07-16 15:13 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య‌మైన ప‌రిణామాల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టికే గండ‌ర‌గండ‌డ‌నే పేరున్న కిమ్ జోంగ్ ఉన్‌ తో స‌మావేశం అయి త‌ను ఎంత దూకుడుగా ఉంటానో..అంతే సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే సందేశాన్ని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వినూత్న ఒర‌వ‌డికి కొన‌సాగింపుగా...తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫిన్లాండ్‌ లోని హెల్సింకిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018 ఫిఫా వరల్డ్‌ కప్‌ ను విజయవంతంగా నిర్వహించినందుకు పుతిన్‌ ను ట్రంప్ అభినందించారు. అంత‌కుముందు  రష్యాతో సంబంధాలు అధ్వానంగా ఉండటానికి అమెరికా పిచ్చితనం - మూర్ఖత్వమే కారణమని ట్రంప్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో భేటీకి కొద్ది గంటల ముందే ఆయన ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు.

పుతిన్‌ తో భేటీ అనంత‌రం ట్రంప్ మాట్లాడుతూ ఇక తమ చారిత్రక భేటీలో ఏయే అంశాలపై మాట్లాడతామో ట్రంప్ వివరించారు. వాణిజ్యం - మిలిటరీ - మిస్సైల్స్ - అణ్వాయుధాలు - చైనా.. ఇలా అన్నింటి గురించి మాట్లాడతామని స్పష్టంచేశారు. అమెరికా - రష్యా సంబంధాలపై కూడా స్పందించారు. కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య అంత మంచి సంబంధాలు లేవని ట్రంప్ అన్నారు. `ఈ మధ్యే నేను రష్యా వచ్చాను. ఇప్పుడు పుతిన్‌ తో మాట్లాడబోతున్నాను. రెండు దేశాలు సత్సంబంధాలు పెంపొందుతాయ‌ని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచమంతా అమెరికా - రష్యాలు కలిసి నడవాలని భావిస్తున్నాయి. ప్రపంచంలో ఈ రెండు దేశాలే అతిపెద్ద అణు శక్తి కేంద్రాలు. 90 శాతం అణ్వాయుధాలు మా దగ్గరే ఉన్నాయి. నిజానికి ఇది మంచి విషయం కాదు. చాలా చెడ్డ విషయం` అని ట్రంప్ అన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై పుతిన్‌ తో మాట్లాడతారా లేదా అన్న అంశంపై ట్రంప్ స్పందించలేదు.

Tags:    
  • Donald Trump 
  • Vladimir Putin 
  • Helsinki 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS