• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భర్త ఆఫీసుకెళ్లి మరీ...

భర్త ఆఫీసుకెళ్లి మరీ వేధించడమా? విడాకులిచ్చిన కోర్టు

By - Tupaki Desk
Update: 2022-08-30 16:30 GMT
70వ దశకంలో మొగుడు టార్చర్ భరించలేక చచ్చి చెడి బతికిన మహిళలు చాలా మంది ఉండేవారు. అప్పుడంతా మగాళ్లదే రాజ్యం. కానీ కాలం మారింది. ఈ ఆధునిక యుగంలో భార్యా బాధితులు ఎక్కువై పోతున్నారు. మగాడికి  ఇంట్లో స్వేచ్ఛ లేకుండా పోతోంది. చాలా మంది మగాళ్ల వాదన ఇదే. అందుకే టీవీ షోలల్లో మగాళ్ల పరిస్థితులపై అప్పుడప్పుడూ కామెడీ కూడా పేలుతోంది.

భార్యల వేధింపులపై ‘భార్యా బాధిత సంఘాలు’ కూడా వెలిశాయి. భర్త పనిచేసే ఆఫీసుకు భార్య వెళ్లి పది మంది ముందు అతడిని అసభ్య పదజాలంతో తిడుతూ వేధించింది. ఇది చాలా క్రూరత్వమని చత్తీస్ ఘడ్ హైకోర్టు ఏకంగా విడాకులిచ్చి ఆ భార్యకు షాకిచ్చింది.  ఓ విడాకుల కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ధంతరి జిల్లాకు చెందిన 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి 2010లో రాయ్ పూర్ కు చెందిన ఓ మహిళతో వివాహమైంది. అయితే కొంతకాలానికి వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో భర్త.. విడాకుల కోసం రాయ్ పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య తరచూ తనను వేధిస్తోందని.. కనీసం తన తల్లిదండ్రులను కూడా కలుసుకోనివ్వడం లేదని పేర్కొంటూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వాదోపవాదాలు, సాక్ష్యాలను గమనించిన అనంతరం 2019 డిసెంబర్ లో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

అయితే ఆ భార్య హైకోర్టును ఆశ్రయించింది. భర్త తప్పుడు సాక్ష్యాలు చూపించాడని.. ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని పిటీషన్ లో కోరింది. ఆమె ఆరోపణలను భర్త తోసిపుచ్చాడు. తనకు వివాహేతర సంబంధం ఉందన్న భార్య ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించాయని కోర్టుకు తెలిపాడు. తన భార్య ఆఫీసుకు వచ్చి మరీ తనను అందరి ముందు అసభ్య పదజాలంతో దూషించిందని.. తనను మరో చోటుకు బదిలీ చేయించేందుకు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిందని వాపోయాడు.

భార్య క్రూరత్వానికి కరిగిపోయిన హైకోర్టు విడాకులు ఇస్తూ తుది తీర్పు వెలువరించింది. భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపింది. తప్పుడు ఆరోపణలతో ఆ భార్య ఏకంగా భర్త ఆఫీసుకెళ్లి.. సహోద్యుగుల ముందర పరువు తీయడం క్రూరత్వమే అవుతుందని మండిపడింది. భర్త తన తల్లిదండ్రులను కలుసుకోనివ్వకుండా వేధించడం.. బదిలీ చేయాలని కోరడం  తీవ్రమైన విషయం అని పేర్కొంది. అందుకే ఆ భార్య నుంచి  విడాకులు మంజూరు చేస్తూ రాయ్ పూర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి భర్తపై ఈ స్థాయిలో టార్చర్ చేసిన ఆ భార్య ఆట కట్టైంది.
Tags:    
  • husband 
  • wife 
  • divorce 
  • highcourt 
  • latestnews 
  • viralnews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS