వైసీపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ వార్నింగ్ ఎందుకో తెలుసా?
సీఎం జగన్ ఏపీలో ఎంత కష్టపడితేనేమీ? ఎన్ని కోట్లు పంచిపెడితేనేమీ? అవన్నీ క్షేత్రస్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేల వైఖరి వల్ల బూడిదలో పోసిన పన్నీరు అవుతోందని క్షేత్రస్థాయి నేతలు వాపోతున్నారు. పదేళ్లుగా తాము పార్టీ కోసం పాటుపడితే చివరకు గుర్తింపే లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..
వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచాక కేవలం 15 నెలల్లోనే 50 వేల కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందజేసింది. అయితే గ్రౌండ్ లెవల్లో మాత్రం దీనిపై ఉలుకు పలుకు లేదు అని వైసీపీ హైకమాండ్ గుర్తించింది. సీఎం జగన్ తో మాట్లాడి వైసీపీ అధిష్టానం చైన్నై కంపెనీ ద్వారా కొన్ని సీక్రెట్ సర్వేలు చేపించిందట.. ఆ సర్వేల్లో అసలు ఎమ్మెల్యేలు ఏమీ చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదని తేలిందట..
ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించారు. అయితే అలాంటి వాళ్లకు అసలు నియోజకవర్గాల్లో వైసీపీ మీద పట్టు లేకుండా పోయిందట.. ఈ ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్లకే పనులు ఇస్తుంటే వైసీపీ వర్గాలు సైలెంట్ అయ్యారని సమాచారం. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బుల కోసం కక్కుర్తిపడి టీడీపీ నాయకులను చేర్పించుకొని పనులు ఇస్తున్నారని సర్వేలో తేలిందట.. దీంతో వైసీపీ వర్గాలు తాము ఎందుకు పార్టీని ప్రమోట్ చేయాలని సైలెంట్ అయిపోతున్నారట..
ఇక దాదాపు 100-120 నియోజకవర్గాల్లో అసలు వైసీపీ వర్గాలకు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా పార్టీ గుర్తించడం లేదని వాళ్లలో వాళ్లే మదనపడుతున్నారట.. పార్టీని టీడీపీ వాళ్లు వచ్చి హైజాక్ చేస్తున్నారని హైకమాండ్ కు చెప్పుకునే పరిస్థితి లేదని వైసీపీ వర్గాలు వాపోతున్నాయి.
ఇప్పటికే పార్టీ డ్యామేజ్ అయ్యిందని ఆ సర్వేల్లో తేలిందని సమాచారం. ఆ సర్వే ఒక సీనియర్ మంత్రి, ఒక ఎంపీ ఇద్దరు కలిసి చేపించారని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.