ఏపిలో కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయో తెలుసా?

Update: 2020-11-09 13:50 GMT
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏపిలోని జిల్లాల సంఖ్య మొత్తంగా 32కి పెరగబోతున్నాయా ? అవుననే అంటున్నాయి అధికార వర్గలు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలోని జిల్లాల సంఖ్యను 9 నుండి 31కి పెంచిన విషయం తెలిసిందే.  దాంతో ఏపిలో కూడా జిల్లాల సంఖ్యను  13 నుండి పెంచాలనే డిమాండ్ చంద్రబాబునాయుడు హయాంలోనే మొదలైంది. కారణాలు ఏమిటో కానీ జిల్లాల సంఖ్యను మాత్రం టీడీపీ ప్రభుత్వం పెంచలేదు. అయితే అదే డిమాండ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపందుకుంది. ఎందుకంటే తాను అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగ చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టే.

ఈ నేపధ్యంలోనే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జిల్లాల సంఖ్యను పెంచే విషయంలో జగన్ ఉన్నతస్ధాయి కమిటిని నియమించారు. కమిటి కూడా జిల్లాల కలెక్టర్ల దగ్గర నుండి నివేదికలు తెప్పించుకుంది. దాని ప్రకారం జిల్లాల సంఖ్య 26కి పెరిగే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. అయితే తాజాగా 26 కాదు ఏకంగా 32 జిల్లాలు ఏర్పాటవబోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది.  ఈనెల 15వ తేదీ నుండి మొదలయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే ఓ బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పెరుగుతాయనే అంచనాలున్న జిల్లాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పలాస జిల్లా : పలాస కేంద్రంగా ఉండే జిల్లాలో టెక్కలి - ఇచ్చాపురం - పాతపట్నం నియోజకవర్గాలుంటాయి.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు ఆముదాలవలస - ఎచ్చెర్ల, - రాజాం - నరసన్నపేట నియోజకవర్గాలుంటాయి.

పార్వతీపురం : పార్వతిపురం జిల్లా కేంద్రంగా ఉండబోయే జిల్లాలో పాలకొండ - కురుపాం - సాలూరు నియోజకవర్గాలుంటాయి.

విజయనగరం : విజయనగరం నియోజకవర్గం కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాలో గజపతినగరం - చీపురుపల్లి - శృంగరవరపుకోట - నెల్లిమర్ల - బొబ్బిలి ఉంటాయి.

విశాఖపట్నం : వైజాగ్ కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాలో భీమిలి - విశాఖ తూర్పు - విశాఖ పశ్చిమం - విశాఖ ఉత్తరం - విశాఖ దక్షిణం నియోజకవర్గాలతో పాటు పెందుర్తి - గాజువాక ఉంటాయి.

అనకాపల్లి :  అనకాపల్లి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో తులి - యలమంచిలి - చోడవరం - నర్సీపట్నం - పాయకరావుపేట ఉంటాయి.

కాకినాడ : కాకినాడ కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాలో కాకినాడ సిటీ - రూరల్ తో పాటు ప్రత్తిపాడు - పిఠాపురం - జగ్గంపేట - రామచంద్రాపురం - పెద్దాపురం నియోజకవర్గాలుంటాయి.

రాజమండ్రి : రాజమండ్రి కేంద్రంగా ఉండే జిల్లాలో రాజమండ్రి రూరల్ - సిటీ - అనపర్తి - రాజానగరం - రంపచోడవరం - కొవ్వూరు - నిడదవోలు ఉంటాయి.

అమలాపురం : అమలాపురం జిల్లా  కేంద్రంగా  గన్నవరం - ముమ్మిడివరం - రాజోలు - మండపేట - కొత్తపేట  ఉంటాయి.

నరసాపురం : నరసాపురం జిల్లా  కేంద్రంగా  భీమవరం - తాడేపల్లిగూడెం - తణుకు - ఆచంట - పాలకొల్లు ఉంటాయి.

ఏలూరు : ఏలూరు జిల్లా కేంద్రంగా రాబోయే జిల్లాలో గోపాలపురం - పోలవరం - చింతలపూడి - దెందులూరు - ఉంగుటూరు ఉంటాయి.

మచిలీపట్నం : మచిలీపట్నం జిల్లా కేంద్రంగా అవనిగడ్డ - కైకలూరు - గుడివాడ - పెడన - పామర్రున్నాయి.

విజయవాడ : విజయవాడ కేంద్రంగా  విజయవాడ ఈస్టు - విజయవాడ వెస్టు - విజయవాడ సెంట్రల్ - గన్నవరం - నూజివీడు - తిరువూరు - పెనమలూరు - మైలవరం ఉంటాయి.

అమరావతి : అమరావతి కేంద్రంగా ఏర్పడబోయే కొత్త జిల్లాలో పెదకూరుపాడు - తాడికొండ - మంగళగిరి - జగ్గయ్యపేట - నందిగామ ఉంటాయి.

గుంటూరు : గుంటూరు కేంద్రంగా కొత్త జిల్లాలో గుంటూరు ఈస్ట్ - గుంటూరు వెస్ట్ - తెనాలి - పొన్నురు - ప్రత్తిపాడు ఉంటాయి.

బాపట్ల : బాపట్ల కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాలో రేపల్లె - చీరాల - వేమూరు - పర్చూరు నియోజకవర్గాలుంటాయి.

నరసరావుపేట : నరసరావుపేట కేంద్రంగా చిలకలూరిపేట - సత్తెనపల్లి - గురజాల - మాచర్ల - వినుకొండ నియోజకవర్గాలుంటాయి.

మార్కాపురం : మార్కాపురం కేంద్రంగా ఎర్రగొండపాలెం - దర్శి - కనిగిరి - గిద్దలూరుంటాయి.

ఒంగోలు : ఒంగు జిల్లా కేంద్రంగా అద్దంకి - సంతనూతలపాడు - కొండెపి - కందుకూరు నియోజకవర్గాలుంటాయి.

నెల్లూరు : నెల్లూరు కేంద్రంగా నెల్లూరు సిటి - నెల్లూరు రూరల్ - కావలి - కొవ్వూరు - ఆత్మకూరు - ఉదయగిరి ఉంటాయి.

గూడూరు : జిల్లా కేంద్రంగా ఉండే గూడూరులో   సర్వేపల్లి - వెంకటగిరి - సూళ్ళూరుపేట ఉంటాయి.

తిరుపతి :  కొత్త జిల్లా కేంద్రంలో తిరుపతి లో శ్రీకాళహస్తి - నగిరి - సత్యవేడు - చంద్రగిరి నియోజకవర్గాలుంటాయి.

చిత్తూరు : చిత్తూర కేంద్రంగా ఏర్పాటవుతాయని అనుకుంటున్న జిల్లాలో పూతలపట్టు - గంగాధరనెల్లూరు - పలమనేరు - కుప్పం నియోజకవర్గాలుంటాయి.

మదనపల్లి : మదనపల్లి జిల్లాలో పీలేరు - పుంగనూరు - తంబళ్ళపల్లి నియోజకవర్గాలుంటాయి.

హిందుపురం :  హిందుపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కదిరి - దర్మవరం - పుట్టపర్తి - పెనుగొండ - మడకశిర ఉంటాయి.

అనంతపురం : అనంతపురం జిల్లాలో రాయదుర్గం - గుంతకల్లు - కల్యాణదుర్గం - ఉరవకొండ - రాప్తాడు - శింగనమల - తాడపత్రి ఉంటాయి.

ఆదోని : ఆదోని కొత్త జిల్లాలో పత్తికొండ - ఆలూరు - ఎమ్మిగనూరు - మంత్రాలయం నియోజకవర్గాలుంటాయి.

కర్నూలు : కర్నూలు కేంద్రంగా ఉండే జిల్లాలో నందికొట్కూరు - కోడుమూరు - డోన్ జిల్లాలుంటాయి.

నంద్యాల : నంద్యాల కేంద్రంగా ఏర్పడ జిల్లాలో శ్రీశైలం - ఆళ్ళగడ్డ - బనగానపల్లె - పాణ్యం ఉంటాయి.

కడప : కడప జిల్లాలో జమ్మలమడుగు - మైదుకూరు - ప్రొద్దుటూరు - కమలాపురం - పులివెందులుంటాయి.

రాజంపేట : రాజంపేట జిల్లాలో బద్వేలు - రైల్వేకోడూరు - రాయచోటి ఉంటాయి. సో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే ఇపుడున్న జిల్లా కేంద్రాలకు అదనంగా మరో 19 జిల్లాలు ఏర్పాటవుతున్నాయి.   అవేమిటంటే  పలాస - పార్వతిపురం - అరకు - అనకాపల్లి - అమలాపురం - నరసాపురం - విజయవాడ - అమరావతి - బాపట్ల - నరసరావుపేట - మార్కాపురం - గూడూరు - తిరుపతి - మదనపల్లి - హిందుపురం - ఆదోని - నంద్యాల - రాజంపేట జిల్లాలు ఏర్పాటవబోతున్నాయట.
Tags:    

Similar News