• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిగ్గీరాజా….ఇంత అతి...

డిగ్గీరాజా….ఇంత అతి అవసరమా?

By - Tupaki Desk
Update: 2015-09-23 17:17 GMT
చాలాకాలం తర్వాత  తెరమీదకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ర్టాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ తన వివాదాస్పద తీరుతో మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అనారోగ్యానికి చికిత్స పేరుతో అమెరికాలో ఉన్న దిగ్విజయ్ తన ట్వీట్ తో రాజకీయాల్లో వేడి పుట్టించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నప్పటికీ పార్టీలను విమర్శించడంలో బ్యాలెన్స్ కోల్పోయి డిగ్గీ చేసిన ట్వీట్ ఇపుడు రచ్చగా మారింది.

తన వ్యక్తిగత ఖాతాలో దిగ్విజయ్ సింగ్ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఒకే మొహంలో సగభాగం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, మరో సగభాగం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీది. పరస్పరం నిప్పులు చల్లుకునే ఈ ఇద్దరు నేతలను ఒకే ఫొటోలాగా మార్ఫ్ చేసి ఉన్న దాన్ని పోస్ట్ చేసిన డిగ్గీ….వారి వారి మతాల అభివృద్ధి కోసం దురుద్దేశపూరిత పూరితంగా ప్రవర్తిస్తున్న వీరి వల్ల వైషమ్యాలు పెరుగుతున్నాయని పోస్ట్ చేశారు. తన మిత్రుడు ఒకరు ఈ ఫొటోను పంపించారని డిగ్గీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే డిగ్గీ ట్వీట్ పై అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. తన ఫొటోను డిగ్గీ ఆ విధంగా ఫోస్ట్ చేయడం పట్ల అభ్యంతరం లేదని…అయితే ఈ చర్య యావత్ ముస్లింలను అవమానించేలా ఉందన్నారు. దీనికి డిగ్గీ స్పందించారు. తమ పార్టీ పాలనలో అన్ని మతాలను సమానంగా చూడలేదా అంటూ నిలదీశారు.  దీనికి ఓవైసీ ఘాటుగా స్పందించారు. బాబ్రీ మసీదులో విగ్రహాలు పెట్టింది కాంగ్రెస్ పాలనలోనే కదా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే ముంబయిలో అల్లర్లు జరిగాయని, వాటిపై ఇచ్చిన నివేదికను అమలుచేయడంలోనూ ఆ పార్టీ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. పైపెచ్చు…. ఆ ఘటనల్లో నిందితుడు అయిన యాకుబ్ మెమన్ ను ఉరితీయడంపై ఇపుడు కట్టుకథలు చెప్తోందని మండిపడ్డారు.

కొద్దికాలం వరకు కాంగ్రెస్-ఎంఐఎంల మధ్య అత్యంత మైత్రి ఉండేది. గత సార్వత్రిక ఎన్నికల సమయంల నుంచి ఆ బంధానికి బీటలు వారాయి. తాజాగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీల మధ్య లుకలుకలు ఇలా రచ్చకెక్కాయి.
Tags:    
  • Digvijay Singh 
  • Controversial Tweet 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS