• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లాక్ డౌన్ : నిబంధనల్ని...

లాక్ డౌన్ : నిబంధనల్ని తుంగలో తొక్కిన ఎమ్మెల్యే ...కేసు నమోదు !

By - Tupaki Desk
Update: 2020-04-06 09:50 GMT
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ లాక్ డౌన్ సమయంలో కేవలం..నిత్యావసర సరుకుల దుకాణాలు - హాస్పిటల్ - మెడికల్ స్టోర్స్ కి తప్ప వేరే ఏ ఇతర దుకాణాలకు కూడా తెరిచి ఉంచడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ నిత్యావసర సరుకులు తీసుకోవడానికైనా కూడా సామాజిక దూరం పాటించాల్సిందే. అయిన కూడా కొంతమంది అధికారం చేతిలో ఉంది కదా అని - లాక్ డౌన్ సమయంలో కూడా ఇష్టం వచినట్టు ప్రవర్తిస్తూ తుంగలో తొక్కుతూ... ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

తాజాగా ఇలాంటి ఒక సంఘటన మహారాష్ట్ర లో చోటు చేసుకుంది. బీజేపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఉచిత రేషన్ పంచాడు. లాక్ డౌన్ సమయంలో ఉచితంగా రేషన్ పంచితే మంచిదే కదా అని అనుకుంటున్నారా? చేసేది మంచి పనే అయినప్పటికీ ..కరోనా విజృంభిస్తున్న సమయంలో ..బర్త్ డే అంటూ .వందలాది మంది గుమికూడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. దేశంలోనే కరోనా కేసులలో ఎక్కువ శాతం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. వార్దా జిల్లా అర్వి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే దాదారావు పుట్టిన రోజు 2020 - ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం. ఈయన ప్రతి  పుట్టిన రోజు సందర్భంగా పేదలకు బియ్యం - గోధుమలు - ఇతరత్రా సరుకులు అందచేస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేద్దామని డిసైడ్ అయ్యారు. వందలాది మంది గుమికూడడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు - అధికారులు అక్కడకు చేరుకొని - అందరిని తరిమికొట్టారు.

 అలాగే ఆ  ఎమ్మెల్యే అధికారుల నుండి ఈ కార్యక్రమానికి  సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోలేదని, అతని మీద అంటువ్యాధుల చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ,ఆ ఎమ్మెల్యే మాత్రం .. రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తన బర్త్ డే సందర్భంగా కొంతమందికి మాత్రమే నిత్యావసరుకులు మాత్రమే అందచేస్తానని, విపక్షాలే ఇంతమందిని రప్పించారని ఆయన ఆరోపిస్తున్నారు. 
Tags:    
  • Defying COVID 19 lockdown 200 gather to celebrate BJP MLA birthday 
  • Maharashtra 
  • Maharashtra Politics 
  • Maharashtra News 
  • Maharashtra Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS