• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనాతో అమెరికాలో తొలి...

కరోనాతో అమెరికాలో తొలి భారతీయుడి మృతి

By - Tupaki Desk
Update: 2020-03-26 05:40 GMT
అమెరికాలో  కరోనా కారణంగా ఓ  ప్రవాస భారతీయుడు  మరణించడం విషాదం నింపింది. ప్రముఖ చెఫ్, ఫుడ్ బిజినెస్ మ్యాన్ అయిన చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ తాజాగా కరోనా కారణంగా అమెరికాలో పరిస్థితి విషమించి చనిపోయాడు.  న్యూయార్క్ లోని ఆస్పత్రిలో అతడు తుదిశ్వాస విడిచాడు. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో ఇతడిదే తొలి మరణం.

చెఫ్ ప్లాయిడ్ కార్డోజ్ ‘బొంబాయి క్యాంటీన్’ పేర్లతో చైన్ రెస్టారెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతడే సహ యజమాని.  ఓపెడ్రో, బొంబాయ్ స్వీట్ పేర్లతో ఇతడికి షాపులున్నాయి. న్యూయార్క్ లో నివసిస్తుంటాడు. మార్చి మొదటి వారంలో ఇతడు భారతదేశంలోని ముంబైకి వచ్చాడు. ముంబైలో బిజినెస్ చూసుకొని తిరిగి న్యూయార్క్ వెళ్లాడు.

న్యూయార్క్ వెళ్లగానే జ్వరం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరాడు. ఇతడి మరణం భారత దేశంతో సంబంధాలు పెట్టుకున్న వారిలో భయాందోళనను సృష్టించింది.

చెఫ్ ప్లాయిడ్ కార్డోజ్ ముంబైకి వచ్చి వెళ్లాక మరణించడంతో అమెరికన్ అధికారులు ముంబైలోని ఆరోగ్యశాఖకు సమాచారం అందించారు. తద్వారా చెఫ్ ప్లాయిడ్ కలిసిన వారందరినీ గుర్తించి కరోనా పరీక్షలు చేయాలని సూచించారు.

కాగా ఫ్లాయిడ్ మరణంతో అతడితో ముంబైలో కలిసిన వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు వారందరూ కరోనా భయంతో హడలి చస్తున్నారు.
Tags:    
  • Death of the first Indian in America with Corona 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Corona Virus In America 
  • America 
  • Donald Trump 
  • Narendra Modi 
  • Tupaki News 
  • Tupaki Upda 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS