కరోనాకు పుట్టినిల్లు చైనాలో వెలుగు చూసిన ఒక ఉదంతం కొత్త కంగారుగా మారటమే కాదు.. గుండెలు అదిరేలా చేస్తోంది. ఇక్కడ జరిపిన ఒక పరిశోధనకు సంబంధించిన ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. చైనాలోని గ్యాంగ్జౌలో ఒక అపార్ట్ మెంట్ నెలల తరబడి ఖాళీగా ఉంది. అయితే.. ఆ అపార్ట్ మెంట్ ప్లాట్లలో ని బాత్రూంలో కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లుగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. నెలల తరబడి వాడని బాత్రూంలో కరోనా ఎలా చేరిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్లోని వేరే అంతస్తుల్లో రెండు కరోనా కేసుల్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో పేషెంట్ల మల మూత్రాల ద్వారా డ్రైన్ లోకి వెళ్లిన కరోనా.. ప్లంబింగ్ ద్వారా వేరే అంతస్తుల్లోని బాత్రూంలోకి చేరి ఉంటాయని భావిస్తున్నారు. బహుళ అంతస్తుల్లో డ్రైనేజీ పైపులు ఒకదానితో మరొకటి లింకు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక అంతస్తులోని బాత్రూం నుంచి ఖాళీగా ఉన్న అంతస్తుల్ని బాత్రూంలోకి కరోనా చేరి ఉంటుందని భావిస్తున్నారు.
కరోనా వైరస్ క్రిములు గాలి తుంపర్లతోనూ వ్యాప్తి చెందటాన్ని ఇంతకు ముందే చైనా పరిశోధకులు గుర్తించారు. వైరస్ తో కూడిన ఈ కణాలు గాలిలో చాలా సేపు ఉంటాయని.. చాలా దూరం వ్యాపిస్తాయని చెబుతున్నారు. తాజాగా వెలుగు చూసిన మరో అంశం ఏమంటే.. ఇరుగ్గా.. గాలి తగినంతగా సోకని ప్రదేశాల్లో కరోనా ఎక్కువ కాలం ఉంటుందని గుర్తించారు. ఇదంతా చూస్తే.. కరోనాను ఎదుర్కోవటం అంత తేలికైన విషయం ఎంతమాత్రం కాదన్న విషయం అర్థం కాక మానదు.