• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 21 బుధవారం 2018...

నవంబర్ 21 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-21 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి. రియల్ ఎస్టేట్ వారికి నూతన అగ్రిమెంట్లు. ఉద్యోగాలకు పదోన్నతి. పారిశ్రామిక, వైద్య రంగాలవారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు. సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని పూజించండి.

వృషభ రాశి: రాబడి నిరుత్సాహం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపారులు నిదానం పాటించాలి. ఐటీ నిపుణులు తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. పారిశ్రామిక - వ్యవసాయ రంగాల వారికి అనుకూలించదు. మహిళలకు మానసిక ఆందోళన. సత్యనారాయణ స్వామిని పూజించండి.

మిథునరాశి: వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు. నిరుద్యోగులు శ్రమిస్తే ఫలితం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో ముందుడుగు వేస్తారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఐటీ నిపుణులకు సాంకేతిక విద్యావకాశాలు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం. మహిళలకు శుభవార్తలు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కర్కాటక రాశి: గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ముందుడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి. పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

సింహరాశి: ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు. భాగస్వాములతో తగాదాలు. బంధువులతో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. ఐటీ నిపుణులకు విధుల్లో అవాంతరాలు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. మహిళలకు ఆస్తి వివాదాలు. గణపతి స్తోత్రాలు పఠించండి.

కన్యారాశి : నిర్ణయాలు ఆచితూచి వ్యవహరించండి. దూరప్రయాణాలు ఉండవచ్చు. పనుల్లో ఆటంకాలు. నిరుద్యోగులకు నిరాశ. ఉద్యోగులకు మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు శుభవార్తలు. వ్యాపారులకు చికాకులు. విద్యార్థులకు సంతృప్తికర ఫలితాలు ఉండవు. ప్రత్యర్థులు సమస్యలు సృష్టిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన. దత్తాత్రేయుడిని పూజించండి.

తులారాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు బయటపడుతాయి. ఉద్యోగులకు ఆశాజనంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి అనూకూల సమయం. ఐటీ నిపుణులకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు. విదేశీయానం. మహిళలకు తండ్రి తరఫు వారి నుంచి ఆస్తి లేదా ధన లాభం కలుగుతుంది. షిర్డీ సాయిబాబాకి అర్చన చేయించండి.

వృశ్చిక రాశి: ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగులకు జీవిత స్థిరత్వం కలుగుతుంది. మీ ఆశయం నెరవేరుతుంది. ఇంటాబయటా ఉత్సాహంగా గడుస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వ్యాపారాలు విస్తరిస్తాయి. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి సన్మానాలు. విద్యార్థులకు మంచి ఫలితాలు. మహిళలు శుభవార్తలు వింటారు.  శివాలయంలో అభిషేకం చేయించండి.

ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి గందరగోళం. స్వల్ప అనారోగ్యం. నిరుద్యోగులకు అసంతృప్తి. కుటుంబ సభ్యులతో విభేధాలు. వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపారులకు లాభాలు స్వల్పం. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులు నిదానం పాటించాలి. ఉద్యోగులకు నూతన బాధ్యతలు ఇబ్బంది కలిగించవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.

మకర రాశి: రాబడి తగ్గుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా చికాకులు. ఉద్యోగులకు పనిభారం. కాంట్రాక్టర్లు. రియల్టర్లకు కోర్టు కేసులు ఎదురుకావచ్చు. ఐటీ నిపుణులకు నిరాశజనకం. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. సుబ్రహ్మణ్వేశ్వరుడిని పూజించండి.

కుంభరాశి: ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు. ఆస్తి వివాదాలు తొలుగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పారిశ్రామిక, వైద్య, ఐటీ రంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులకు పరీక్షల్లో విజయం. మహిళలకు కుటుంబంలో విశేష ఆదరణ. శివాష్టకం పఠించండి.

మీనరాశి: భూవివాదాలు చికాకులు కలిగిస్తాయి. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య,కుటుంబ సమస్యలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. ఐటీ నిపుణులకు బదిలీలు. విద్యార్థులకు నిరుత్సాహం. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహం తగ్గుతుంది. వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అంగారక స్తోత్రాలు పఠించండి. 


Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS