• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 5 శుక్రవారం 2018...

అక్టోబర్ 5 శుక్రవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-05 01:46 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బ్యాంకుపనుల్లో ఆలస్యంతో దెబ్బపడుతుంది. స్త్రీలకు దంతాలు - నరాలు  - కళ్లకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. కొబ్బరి - పండ్లు - పూల - పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. మీ అంతరంగిక - కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి.

వృషభరాశి:  రియల్ ఎస్టేట్ రంగంలోని వారి కృషి ఫలిస్తుంది. ఉద్యోగ నియామకాలకు అనుకూలం. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మార్పులు - చేర్పులకు అవకాశం ఉంది. వస్త్ర వ్యాపారులు పనివాళ్లను ఓ కంట కనిపెట్టండి..ఉద్యోగులు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండండి. స్త్రీలకు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తత అవసరం.

మిథునరాశి:  వాహనాల కొనుగోలుకు అనుకూలం. స్టేషనరీ - రవాణా - సెల్ ఫోన్లు - ఏజెన్సీ రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో శుభపరిణామాలు. స్థిరాస్తి అమ్మాకాలను వాయిదా వేయండి. అనవసరపు వివాదాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది.  మీ ప్రమేయం లేకున్నా కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

కర్కాటకరాశి: స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. రుణాలు - పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.  మార్కెటింగ్ - ఏజెంట్లు - బ్రోకర్లకు యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. రుణం తీర్చడంలో ఒత్తిడి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 

సింహరాశి: మార్కెటింగ్ - ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. కొత్త ఆలోచనల అమలుకు సరైన సమయం. ఇంటర్వ్యూల్లో విజయం. అగ్రిమెంట్లకు అనుకూలం. ప్రింటింగ్ రంగాల్లోని వారు అచ్చు తప్పులు పడటంతో మాట పడుతారు. దైవ - సాంఘిక - సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. ఉద్యోగస్తులతో తొందరపాటు - చర్యలు - నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కన్యరాశి: టెలివిజన్ - టెక్స్ టైల్స్ - ఎగుమతులు - ఫొటోగ్రఫీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. గతంలో చేసిన కృషికి ఫలితం అందుకుంటారు. ఉద్యోగ - వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. వైద్యులకు ఒత్తిడి - పనిభారం తప్పవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత.

తులరాశి: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. సమావేశాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. యూనియన్లు - సహకార సంఘాలకు సంబంధించిన విషయాల్లో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఆసూయ పడేవారు ఎక్కువవుతారు. రాజకీయ నాయకులు బిజీ అవుతారు. రావలసిన పత్రాలు - రసీదులు చేతికందుతాయి. మీ అంచనాలు ఫలిస్తాయి. స్త్రీలకు స్వయం సంపాదన.

వృశ్చికరాశి: రాజకీయ - ఆధ్యాత్మిక రంగాల వారిని కలుసుకుంటారు. పెద్దల సహకారం అందుకుంటారు. వృత్తి - వ్యాపారాల్లో లక్ష్య సాధనకు గత అనుభవం తోడ్పడుతుంది. ప్రముఖులతో సమావేశాలు - ప్రయాణాలు సత్ఫలితాలనిస్తాయి. పారిశ్రామిక రంగాల వారి ఇసుక - క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ  సమాచారం. వృత్తి  - ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. వైద్యులకు ఓర్పు - ఏకాగ్రత ముఖ్యం.

ధనురాశి: పదిమందిలో మీ మాట చెల్లుబాటవుతుంది. బంధుమిత్రులతో వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. వ్యూహాత్మకంగా అడుగులు వేసి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. మార్కెటింగ్ - ప్రైవేటు సంస్థల్లోని వారు అధిక శ్రమ - ఒత్తిడికి గురవుతారు. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. రుణ - ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది.

మకరరాశి: పూర్వ అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. మెడికల్ క్లెయిమ్ లు మంజూరవుతాయి. పొదుపు పథకాలు - రుణాల మంజూరు విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. స్త్రీలకు ఉదరం - మోకాళ్లు - నరాలకు సంబంధించిన చికాకులు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. 

కుంభరాశి: అనుబంధాలు బలపడతాయ. సంకల్పం నెరవేరుతుంది. పందాలు - పోటీలు - న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు.వేడుకల్లో పాల్గొటారు.  వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలిగి పురోగతి సాగిస్తారు. రిప్రజేంటేటివ్ లకు , ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.

మీనరాశి: హోటల్ - పరిశ్రమలు - కన్సల్టెన్సీ రంగాల వారికి శుభప్రదం. ఆస్పత్రులు - వైద్య పరీక్షలకు ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. విందు - వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. లక్ష్యాలు సాధిస్తారు. పెద్దలకు అనారోగ్యం. నోరు అదుపులో ఉంచుకోండి.  వైద్య - ఇంజనీరింగ్ - కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి - ప్రేమికుల మధ్య అనుమానాలు - అపార్థాలు తలెత్తుతాయి.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS