జూనియర్ ట్రంప్ కి కరోనా పాజిటివ్!

Update: 2020-11-21 06:45 GMT
కరోనా మహమ్మారి జోరు చూస్తుంటే ఈ మహమ్మారి వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి ఏడాది దాటింది. అయినా ఇప్పటివరకు దీన్ని అరికట్టే సరైన వ్యాక్సిన్ ఇంకా మార్కెట్ లోకి రాలేదు. మధ్యలో కొన్ని రోజులు ఈ మహమ్మారి తీవ్రగా తగ్గినట్లు కనిపించినా , ఆ తర్వాత మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. అలాగే అధ్యక్షుల నుండి సామాన్యుల వరకు ఎవరిని కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు.  కరోనాకు వారు వీరు అనే తేడా లేదు. ఎవరికైనా ఎలాగైనా సోకవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనాకు బలి కావాల్సి వస్తుంది.  ఇప్పటికే దేశంలో అనేకమంది రాజకీయ నాయకులు కరోనాబారిన పడ్డారు.  కరోనా వైరస్ వల్ల బలయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కుటుంబం లో కరోనా జోరు కొనసాగుతుంది.

ఎన్నికలకు 20 రోజుల ముందు ట్రంప్ ‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ కరోనా బారిన పడగా... తాజాగా ఆయన పెద్ద కొడుకు జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ వారం ప్రారంభంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో జూనియర్‌ ట్రంప్‌ కు పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆయన క్వారంటైన్ ‌లో ఉన్నారని , జూనియర్‌ ట్రంప్‌కు ఎలాంటి లక్షణాలు లేవని. కరోనా నిబంధనల ప్రకారం చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. 42 ఏళ్ల వయసుగల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కు కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ అని వచ్చిందని వైద్యులు చెప్పారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు 1, 22, 68, 678 కరోనా కేసులు నమోదవగా.. 2,60, 235 మంది మృతి చెందారు.
Tags:    

Similar News