• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నీటి సరఫరా నిలివేయడానికి...

నీటి సరఫరా నిలివేయడానికి కారణం చెప్పిన ఫ్రాన్స్‌ ..ఏంటంటే !

By - Tupaki Desk
Update: 2020-04-20 12:30 GMT
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అగ్రరాజ్యం అమెరికా సహా ఇటలీ - స్పెయిన్‌ - ఫ్రాన్స్‌ వంటి దేశాలపై కరోనా నృత్యం చేస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే లాక్‌ డౌన్‌ లో ఉన్న ఫ్రాన్స్‌ లో ఇప్పటివరకు 19,718 మంది కరోనా భారిన పడి మరణించగా... దాదాపు లక్షన్నర మందికి పైగా ఈ ప్రాణాంతకరమైన కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కరోనా తీవ్రతని దృష్టిలో పెట్టుకొని మే 11 వరకు లాక్‌ డౌన్‌ గడువు పొడిగిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ లోని వీధులను శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తున్న నీటిలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాయనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పారిస్‌ వాటర్‌ అథారిటీ ప్రకటించింది. దీని పై స్థానిక అధికారి ఒకరు మాట్లాడుతూ ..రాజధానిలో వివిధ ప్రాంతాల నుంచి 27 నీటి నమూనాలను పరీక్షించగా.. అందులో నాలుగింటిలో కరోనా వైరస్‌ కు సంబంధించిన సూక్ష్మ ఆనవాళ్లను తమ లాబొరేటరీ గుర్తించిందని తెలిపారు. ఈ నీటిని పార్కులు, వీధులను శుభ్రం చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తామని, తాగునీటి సరఫరాకు ప్రత్యేక వ్యవస్థ ఉందని స్పష్టం చేశారు.

ఇప్పటికే నాన్‌- పాటబుల్‌ వాటర్‌ సప్లై నిలిపివేశామని, కాబట్టి ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. కాగా సీనీ నది, ఆర్క్యూ కెనాల్‌ నుంచి సేకరించిన నీటిని ఫౌంటేన్స్‌ నిర్వహణ, పబ్లిక్‌ పార్కుల్లో పచ్చదనం పెంచడం కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నీటిలోకి కరోనా ఆనవాళ్లు ఎలా వచ్చాయి అన్న విషయం మాత్రం ఎంతగా ఆలోచించిన అర్థం కావడం లేదని అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటికే పైపుల ద్వారా సరఫరా చేసిన నీటి ద్వారా ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అని విశ్లేషిస్తున్నామని తెలిపారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • france 
  • France explanation on water supply stops 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS