• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఒకవైపు కరోనా..మరోవైపు...

ఒకవైపు కరోనా..మరోవైపు వర్షం..వణికిపోతున్న బెంగళూరు, మరో 3 రోజులు ఇలాగే ..!

By - Tupaki Desk
Update: 2020-04-24 03:30 GMT
దేశం మొత్తం కరనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ అమలు చేశారు. ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన  బెంగళూరులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తుంటే .. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం  నుంచి బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. బెంగళూరు సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మరో 72 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందటూ భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉరుములు, మెరుపులు ఆరంభం అయ్యాయి. వాతావరణం ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయింది.  కొన్ని చోట్ల ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆ వెంటనే చినుకులుతో ఆరంభమైన వర్షం చూస్తుండగానే కుండపోతగా మారింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.యశ్వంతపుర, మల్లేశ్వరం, రాజాజీ నగర, మెజస్టిక్, చిక్‌పేట, మహాత్మాగాంధీ రోడ్డు, సదాశివ నగర, బీటీఎస్ రోడ్డు వంటి ప్రాంతాలతో పాటుగా .. బెంగళూరు శివార్లలోనూ భారీ వర్షం పడింది.

బెంగళూరు మహానగర పాలికె సిబ్బంది వర్షపునీటిని తోడేసే పనిలో నిమగ్నం అయ్యారు. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య మార్పు వల్ల కరోనా వైరస్ మరంత వేగంగా ప్రబలే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసినట్లు సమాచారం. అలాగే , బెంగళూరుతో పాటు చిక్‌ మగళూరు, కొడగు, శివమొగ్గ, హసన్ వంటి ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Corona Virus In Andhra Pradesh 
  • Corona Virus 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS