కరోనా ఎఫెక్ట్: శృంగారంపై ఆంక్షలు

Update: 2020-10-17 17:33 GMT
కరోనా కారణంగా ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు కఠినంగా నిబంధనలు అమలు చేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టైంలో శృంగారం వద్దని.. బ్యాచిలర్ లైఫ్ గా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

కరోనా విజృంభిస్తున్న ప్రాంతాల్లో దంపతులు, కుటుంబ సభ్యులు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని.. లండన్, టూటైర్, త్రీటైర్ నగరాల్లో ఈ మేరకు శనివారం బ్రిటీష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేర్వేరుగా ఉంటున్న భార్యభర్తలు, సుధీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధాలు కలిగిన జంటలు ఇంట్లో లేదా బయటైనా కలుసుకున్నప్పుడు ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ మార్గదర్శకుల్లో పేర్కొంది.

బ్రిటీష్ ప్రజలు ఎలాంటి లైంగిక సంబంధాలకు మొగ్గు చూపవద్దని బ్రిటన్ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జంటలు సహజీవనం చేస్తున్నా.. కలుస్తున్నా భౌతికదూరం పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు ఇచ్చారు.

లైంగిక సంబంధాలపై ఆంక్షలు విధించే హక్కు ప్రభుత్వానికి లేదని.. తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News