కరోనా వేళ డేటింగ్ రూల్స్ మారాయి బాస్!

Update: 2021-04-28 11:30 GMT
మొదటి వేవ్ ముగిసి.. కరోనాను జాయించామన్న  ఫేక్ ఫీలింగ్.. దేశాన్ని.. దేశ ప్రజల్నిదారుణంగా దెబ్బ తీసింది. కరోనా మొదటి వేవ్ లో భారీగా పెరిగిన డేటింగ్ యాప్ ల క్రేజ్.. మళ్లీ మొదలైందట. ఇంట్లో నుంచి కాలు కదిపి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళ్లినా.. పరిమితుల మధ్య పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటివేళ.. డేటింగ్ యాప్ లలో కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తోంది. మనసుకు ఎంత నచ్చిన వారైనా భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి వస్తోంది.

గతంలో మాదిరి.. కొత్త పరిచయాలు.. అవి కాస్త ముందుకు వెళ్లటానికి చాలానే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఆఫీసులు.. కాలేజీలు బంద్ కావటంతో పాటు.. సోషల్ హ్యాంగౌట్స్ కు స్వేచ్ఛగా వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో డేటింగ్ యాప్ లకు మించిన మంచి ప్లాట్ ఫాం మరొకటి లేదన్నది ఇప్పుడు పలువురి నోట వినిపిస్తున్న మాట. అయితే.. సైబర్ నేరగాళ్ల పడగ నీడలోకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చే పరిస్థితి.

ఈ విషయంపై అవగాహనతో అడుగు ముందుకు వేస్తే.. సమస్యలు రాకపోవచ్చు. ఇదిలా ఉంటే.. సెకండ్ వేవ్ లో.. వ్యాక్సిన్ వేసుకోవటం డేటింగ్ యాప్ లలో పెద్ద ట్రెండింగ్ అంశంగా మారినట్లు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారితో డేటింగ్ చేసేది లేదని 60 శాతం మంది తేల్చి చెబుతున్నారట. డేటింగ్ యాప్ లలో పరిచయమైన వారు సరదాగా కాఫీకి వెళ్లాలన్నా.. సరదాగా లంచ్.. డిన్నర్ చేయాలన్నా వ్యాక్సిన్ వేసుకున్నారా? లేదా? అన్నది మొదటి ప్రాధాన్యత అంశంగా మారినట్లు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారితో ముందుకు సాగటానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారని.. డేటింగ్ యాప్ లలో ఇదోట్రెండ్ గా మారినట్లు చెబుతున్నారు.

వ్యాక్సిన్ వేయించుకునే వారి విషయంలో సానుకూలత 238 శాతానికి పెరిగినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టిండర్.. ఓకే కుపిడ్.. కాఫీ మీట్స్.. బంబుల్ తదితర డేటింగ్ యాప్ లు దాని వాడకందారుల అభిరుచికి తగ్గట్లు వ్యాక్సిన్ అంశానికి ప్రాధాన్యతను ఇవ్వటం గమనార్హం. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? తీసుకోవాలనుకుంటున్నారా? లాంటివి ప్రశ్నల్ని సంధిస్తున్నారు. వీటికి సానుకూల సమాధానాలు వచ్చిన వారికే ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు.

60 శాతం మంది యూజర్లు వ్యాక్సిన్ వేసుకున్న వారితోనే డేటింగ్ కు సై అంటున్న వైనం తమ పరిశోధనలో తేలినట్లుగా ఎలేట్ డేటింగ్ చెబుతోంది. డబుల్ డోస్ బ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ప్రొఫైల్ లోఉంటే.. ప్రపోజల్స్ రెట్టింపుస్థాయిలో వస్తున్నట్ులగా చెబుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న యూజర్లకు లైకులు అధికంగా వస్తున్నట్లు ‘‘ఓకే కుపిడ్’’ డేటింగ్ యాప్ చెబుతోంది. మొత్తంగా డేటింగ్ యాప్ లోనూ.. వ్యాక్సిన్ అన్నది కీలకంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News