• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా: దేశం మరణాలు అన్ని...

కరోనా: దేశం మరణాలు అన్ని లక్షలా? దాచేశారా?

By - Tupaki Desk
Update: 2021-05-27 08:30 GMT
భారతదేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రం కోవిడ్ -19 కేసులను తక్కువగా నివేదిస్తోందని ఆరోపణలున్నాయి. ఎందుకంటే బయట ఉన్న కరోనా కేసులు, మరణాలకు.. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు అస్సలు పొంతనే లేదన్నది వాస్తవం అంటున్నారు. వైరస్ సంబంధిత మరణాలను రాష్ట్రాలు బాగా దాచేస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 2.7 కోట్ల కేసులు నమోదయ్యాయి. కేవలం 3 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

అయితే అమెరికాకు చెందిన టాప్ మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్’ భారతదేశంలో నిజంగా 40 లక్షల కోవిడ్ -19 మరణాలు సంభవించవచ్చని సంచలన కథనాన్ని వండివార్చింది. "పేలవమైన రికార్డులు ", "విస్తృతమైన పరీక్ష లేకపోవడం".. "భారతదేశం మహమ్మారి  నిజమైన స్థితిని బాగా అర్థం చేసుకోకపోవడంతో మరణాలు" బాగా సంభవించాయని న్యూయార్క్ టైమ్స్ దాని ప్రత్యేక వ్యాసంలో ప్రధాన కారణాలుగా చూపింది.

ఈ కథనాన్ని ప్రచురించే ముందు, న్యూయార్క్ టైమ్స్ విస్తృతమైన పరిశోధనలు చేసింది. కేసులు.. మరణాల సంఖ్యను విశ్లేషించడానికి నిపుణులతో మాట్లాడింది. వారి విశ్లేషణలో, న్యూయార్స్ టైమ్స్ అంచనా ప్రకారం ఈ కేసులు అధికారిక గణాంకాల కంటే 15 రెట్లు అధికంగా ఉన్నాయని తేలింది. మరణాల సంఖ్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలో లభించిన డేటా కంటే రెండు రెట్లు ఎక్కువ అని తేల్చారు.

మొదటి వేవ్ లో సంక్రమణ..మరణాల రేటు తక్కువగా ఉందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. కానీ సెకండ్ వేవ్ విషయాలను మరింత దిగజార్చింది. రాబోయే రోజుల్లో సంక్రమణ.. మరణాల అంచనాలు పెరగవచ్చని తెలిపింది. కేసుల సంఖ్య 26 శాతం పెరగవచ్చని.. సుమారు 70 కోట్ల మంది భారతీయులు వైరస్ బారిన పడవచ్చని బాంబు పేల్చింది. అయితే మరణాల రేటు 14 రెట్లు అధికంగా ఉండవచ్చు మరియు 42 లక్షల మంది చనిపోయి ఉండొచ్చని అంచనావేసింది.

న్యూయార్క్ టైమ్స్ నివేదికను తోసిపుచ్చలేని విధంగా ఉంది.. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు కోవిడ్ -19 కేసులను తక్కువగా నివేదిస్తున్నాయి. వైరస్ కలిగి ఉన్న చర్యలపై రాష్ట్ర హైకోర్టు నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ జిల్లాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. తెలంగాణలో మొత్తంగా 100 కూడా మరణాలు దాటని పరిస్థితి నెలకొంది.
Tags:    
  • corona deaths 
  • Covid 19 vaccine 
  • corona vaccine 
  • corona vaccine India 
  • Breaking News 
  • Latest Corona News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS