• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉత్తమ్ ను వదలని పీసీసీ...

ఉత్తమ్ ను వదలని పీసీసీ చీఫ్ పదవి

By - Tupaki Desk
Update: 2016-02-20 09:00 GMT
ఒకప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి అంటే ఎంతో పోటీ ఉండేది.... దానికోసం నాయకుల మధ్య తెగ పోటీ ఉండేది. కానీ, ఇప్పుడు తెలంగాణలో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.  పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ కుమార్ ఆ పదవిని వదిలించుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు... దీంతో అధిష్ఠానం మాత్రం బాబ్బాబూ! నువ్వే ఉండాలి అంటూ ఆయన రాజీనామాను ఆమోదించడం లేదట. అంతేకాదు... ఆ పదవి కోసం టీకాంగ్రెస్ లో ఒక్కరు కూడా ఇంట్రస్ట్ చూపించడం లేదు.

ఇటీవల జరిగిన జిహెచ్‌ ఎంసి - నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆ రెండు సందర్భాల్లోనూ ఉత్తమ్‌ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించారని, పార్టీ అధినాయకత్వం ఆయన రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌ లో పెట్టిందని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన రోజే ఉత్తమ్ తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిహెచ్‌ ఎంసి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను పంపించారని అంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ రాజీనామా లేఖను పెండింగ్‌ లో పెట్టింది. ఇంతలో నారాయణ్‌ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది. నారాయణ్‌ ఖేడ్ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమిపాలు కావటంతో కలత చెందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మరోసారి తన రాజీనామా లేఖను దిగ్విజయ్ సింగ్‌ కు పంపించారట. దానినీ ఆమోదించలేదు.

ఉత్తమ్ రెండు సార్లు రాజీనామా చేసినా ఆమోదించకపోవడానికి కారణం స్పష్టంగ కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ లేరు. దాంతో ఆయన రాజీనామాను ఆమోదిస్తే ఆ పదవిని ఖాళీగా పెట్టుకోవడమే తప్ప నింపడం చాలా కష్టం. అది మరింత అవమానకరంగా ఉంటుంది.  దీంతో పదవిని వదిలించుకోవాలని ఉత్తమ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధిష్ఠానం మాత్రం ఆయన్నే కొనసాగిస్తోంది.
Tags:    
  • Congress Party 
  • Uttam Kumar Reddy 
  • Telugu NEWs 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS