ఏపీకి `హోదా`పై కాంగ్రెస్ న్యాయపోరాటం.. మోడీని కోర్టుకు లాగేస్తారట!!
ఏపీకి ప్రత్యేక హోదా విషయం.. కోర్టు గడప తొక్కనుందా? కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోర్టు మెట్లు ఎక్కించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోందా? అంటే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన తీర్మానాన్ని బట్టి.. ఔననే అంటున్నారు నాయకులు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవ టంపై మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అండ్ కోకు లీగల్ నోటీసులు ఇవ్వాలని ఏపీసీసీ లీగల్ సెల్ తీర్మానించింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు సైతం రూపొందించి కార్యాచరణకు దిగనున్నారు.
విషయంలోకి వెళ్తే.. విభజనతో నష్టపోతున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్థావించారు. అయితే.. ఇప్పటి వరకు అంటే.. రాష్ట్ర విడిపోయి.. 8 ఏళ్లు గడిచిపోయినా.. ఈ విషయం ఎటూ తేలలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం.. బీజేపీ నేతృత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడడంతో ఏపీకి ప్రత్యేక హోదా అంశం అటకెక్కింది.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన బీజేపీ.. దీనిని వదిలేయడం. ఇవ్వలేమని స్పష్టం చేయడం. ఇక, గత సీఎం చంద్రబాబు కూడా మెతకవైఖరి అవలంబించారు. హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం అనడంతో చంద్రబాబు ఒప్పుకొన్నారు. ఇక, ఈ విషయంలో చంద్రబా బు కొన్ని రోజులు ప్యాకేజీ ముద్దన్నారు.. ఎన్నికలకు ముందు ప్రజల నుంచి సెగతగులుతుందని గ్రహిం చి.. హోదా కావాలన్నారు. అయితే.. ఈ క్రమంలో కేంద్రం అటు హోదాకు ఇటు ప్యాకేజీకి కూడా గుండు సున్నా చుట్టేసింది.
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ ఎన్నికలకు ముందు హోదాను సాధిస్తామని గంభీర వ్యాఖ్యలు చేసినా.. తర్వాత తర్వాత.. మెత్తబడ్డారు. తాజాగా కూడా ఆయన దేవుడిపై భారం వేసేశారు. ఈ నేపథ్యంలో ఇక, ఏ పార్టీ ప్రధాని అయితే.. రాజ్యసభలో హోదా ప్రకటన చేశారో.. ఆ పార్టీనే ఇప్పుడు ఏపీలో హోదాపై కోర్టుకు ఎక్కాలని నిర్ణయించింది. ఏపీసీసీ లీగల్ సెల్ సమావేశంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, హోం శాఖ కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లీగల్ నోటీసులు పంపాలని డిసైడ్ చేసింది. ఇదే విషయమై సుప్రింకోర్టులో కేసులు వేయాలని కూడా నిర్ణయమైంది. మరి ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.