• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీటు కావాలంటే 3 కోట్లు...

సీటు కావాలంటే 3 కోట్లు ఇవ్వాల్సిందే!

By - Tupaki Desk
Update: 2018-11-15 17:08 GMT
ఓ వైపు సీట్ల పంప‌కం క‌ల‌క‌లం...మ‌రోవైపు మిత్ర‌ప‌క్షాల విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతుండ‌గానే తాజాగా కాంగ్రెస్ పార్టీ మ‌రో వివాదంలో ప‌డింది. కోట్ల‌కు సీట్లు అమ్ముకుంటున్నార‌నే అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు క్యామ మల్లేష్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ టికెట్ల కోసం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ ఒక్కో నియోజకవర్గం నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తనకు ఇబ్రహీం పట్నం స్థానం కేటాయించేందుకు భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్ రూ. 3 కోట్లు డిమాండ్ చేశారని స్పష్టం చేశారు. తన కుమారుడు అంజన్‌ తో పాటు మరొక సన్నిహితుడిని సాగర్ వద్దకు పంపితే.. రూ. 3 కోట్లు ఇస్తే సీటు కన్ ఫామ్ చేస్తామని సాగర్ చెప్పినట్లు మల్లేష్ పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన ఆడియోను క్యామ మల్లేష్ ఇవాళ విడుదల చేశారు.

ఈ సందర్భంగా క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంటే టీఆర్ ఎస్సే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చిందన్నారు. ``కేసీఆర్ విమర్శించే కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి. సీట్ల కేటాయింపులో యాదవులు - కుమ్మరులకు  అన్యాయం జరిగింది. ముడుపులు తీసుకోని కాంగ్రెస్ టికెట్లు పంచింది. స్క్రీనింగ్ కమిటీ వ్యవహారం కంచె చేను మేసినట్టు ఉంది. రాజకీయంలో ఉండి డబ్బు - వయస్సు - జీవితం పొగొట్టుకున్నాను. అధిష్టానానికి తెలియజేయాలని మీడియా ముందుకు వచ్చాను. రూ. 3 కోట్లు డిమాండ్ చేసిన విషయాన్ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - కుంతియా దృష్టికి కూడా తీసుకెళ్తే బయటపెట్టొదన్నారు. తర్వాత మాట్లాడుదామని సర్ది చెప్పారు. రూ. 5 కోట్లతో మొదలు పెట్టి రూ. 4 కోట్లకు ఫైనల్ చేస్తున్నారు. బంధువర్గానికే సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్‌ లో కోవర్టులు ఉన్నారు`` అని క్యామ మల్లేష్ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌లో  చాలా మంది బ్రోకర్లు చేరారని, డబ్బులు తీసుకొని నాలాంటి నిజమైన నాయకులకు అన్యాయం చేస్తున్నార‌ని క్యామ మ‌ల్లేష్ భ‌గ్గుమ‌న్నారు. `ఈ విషయాలు ఏవీ రాహుల్‌ గాంధీ దృష్టికి పోకుండా జాగ్రత్త పడుతున్నారు. బ్రోకర్లు అంతా కుమ్మకై అన్నాదమ్ములకు - భార్యభర్తలకు టికెట్లు ఇప్పించుకుంటున్నారు. నేను అబద్ధం చెబితే నన్ను ఉరితీయండి. భక్త చరణ్ దాస్ కు - ఆయన్ని సమర్ధించే ఈ దొంగ నాయకులను సవాల్‌ చేస్తున్నా దమ్ముంటే ఎవరినైనా నేను చెప్పేవి అబద్దాలు అని నిరూపించండి. ఇది నిజం కాకపోతే - నన్ను ఉరితీయండి. ఇలాంటి దొంగలు పార్టీ నుంచి వెళ్లిపోతేనే స్వచ్ఛమైన కాంగ్రెస్ బతుకుతుంది. ఈ బ్రోకర్ల వ్యవహారం రాహుల్‌ గాంధీ దృష్టికి పోవాలనే మీడియా ముందు ఆడియో టేపులు విడుదల చేశాను`` అని వెల్ల‌డించారు.
Tags:    
  • congress leader 
  • Kyma mallesh 
  • Telugu NEws 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS