• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సోనియా - ప్రియాంక‌ -...

సోనియా - ప్రియాంక‌ - ఓవైసీ..అంద‌రిదీ ఒక‌టే మంత్రం

By - Tupaki Desk
Update: 2019-12-25 09:07 GMT
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. సీఏఏ - ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల కొనసాగుతున్న నిరసనలకు మద్దతు తెలుపుతున్నట్టు 70కి పైగా విద్యార్థి - యువజన సంఘాలు మంగళవారం ఢిల్లీలో ప్రకటించాయి. నూతన సంవత్సరం రోజున నేషనల్‌ యంగ్‌ ఇండియా కో-ఆర్డినేషన్‌ అండ్‌ క్యాంపేయిన్‌ (వైఐఎన్‌ సీసీ)తో పాటు మరికొన్ని మద్దతు సంఘాలతో రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేస్తామని విద్యార్థి నాయకులు తెలిపారు. అయితే, ఇదే స‌మ‌యంలో యూపీలో ఓ ఆస‌క్తిక‌ర కేసు న‌మోదు అయింది. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక‌గాంధీ - ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆందోళ‌న‌కారుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఆరోపించారు.

సీఏఏకు వ్యతిరేకంగా యూపీలో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో ఇప్ప‌టికే ప‌లువురు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఓ ఆస‌క్తిక‌ర పిటిష‌న్ దాఖ‌లైంది. సోనియా - ప్రియాంక - అసదుద్దీన్ ఓవైసీలపై యూపీలోని అలీగఢ్‌ చీఫ్‌ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రదీప్‌ గుప్తా అనే అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. వీరు చేస్తున్న ప్రసంగాలు.. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయంటూ వీరిపై కేసు నమోదు చేయాలంటూ ఆ న్యాయవాది విన్న‌వించారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.

మ‌రోవైపు - సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌ లో చేపట్టిన నిరసనల్లో భాగంగా రేగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ - ప్రియాంక గాంధీ వాద్రాను యూపీలోని మీరట్‌ లో పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. సున్నిత ప్రాంతమైన మీరట్‌లో 144 సెక్షన్‌ విధించామని - పర్యటన వల్ల జిల్లాలో ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే మీరే(రాహుల్‌ - ప్రియాంక) బాధ్యత వహించాలని వాళ్లతో చెప్పామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.  దీంతో రాహుల్‌ - ప్రియాంక ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు.
Tags:    
  • Sonia gandhi 
  • priyanka vadra 
  • Asaduddin Owaisi 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS