2025 వర్క్ ఫ్రం హోమ్ ... కీలక నిర్ణయం తీసుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ !
కరోనా మహమ్మారి కారణంగా మనిషి జీవితంలో ఎన్నో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్..అనేది మనిషి జీవితంలో భాగంగా మారిపోయింది. ఈ వర్క్ ఫ్రం హోమ్ ఐటీ రంగాన్ని పరోక్షంగా చిన్న పట్టణాలు, పల్లెలకు చేరువ చేస్తోంది. ఇది ఏపీకి సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారే. వారు రాష్ట్రం నుంచే పని చేనున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పల్లెలు, చిన్న పట్టణాలు కూడా ఐటీ, ఇతర సేవా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి.
దేశంలోని దాదాపు అన్ని ఐటీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్కం పెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఈ నెల 31తో ముగియాల్సి ఉంది. కానీ దేశంలో ఇంకా కరోనా ముప్పు తొలగకపోవడం.. సెకండ్ వేవ్ వస్తుందనే అంచనాలతో ఐటీ కంపెనీలు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. అందుకే తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ను 2021మార్చి 31 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాయి. 98 శాతం మంది ఇంటినుంచే పని దేశంలో దాదాపు 45 లక్షల మంది ఐటీ, బీపీవో ఉద్యోగులు ఉన్నారు. వారిలో 98 శాతం మంది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డబ్ల్యూఎఫ్‌హెచ్ విధానంలోనే పని చేస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలలో దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 8.75 లక్షల మంది తమ ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. టీసీఎస్ మరో అడుగు ముందుకేసి 2025 వరకు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఇన్ఫోసిస్ కూడా భవిష్యత్ లో తమ ఉద్యోగులలో సగం మంది ఆఫీసుకు వస్తే చాలని భావిస్తోంది. దేశంలో ప్రముఖ కంపెనీలు నగరాల్లోని తమ కార్యాలయాల అద్దెలు, ఇతర నిర్వహణ భారాన్ని తగ్గించుకుంటున్నాయి. గత ఆరు నెలల్లో ఐటీ కంపెనీలు సగటున 40 శాతం వరకు కార్యాలయ భవనాలను ఖాళీ చేయడం గమనార్హం. వర్క్ ఫ్రం హోమ్, వర్క్ ఫ్రం ఎనీవేర్’ అనే అంశాలకు స్థానం కల్పిస్తూ ఐటీ, ఇతర సర్వీస్ ప్రొవైడర్ల సేవల నిబంధనలను కేంద్రం ఇటీవల సడలించింది.