• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ సీఎం జగన్ ఫోటోకు...

ఏపీ సీఎం జగన్ ఫోటోకు తెలంగాణ ఉద్యోగుల పాలాభిషేకం

By - Tupaki Desk
Update: 2021-04-01 07:17 GMT
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చారు. ఆనందంతో స్వీట్లు పంచారు. తమ కష్టాలకు చెల్లుచీటి ఇవ్వటమే కాదు.. అడిగినంతనే స్పందించిన తీరుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ తెలంగాణ ఉద్యోగుల్ని ఇంతలా ఆనందానికి గురి చేసిన సీఎం జగన్ నిర్ణయం ఏమిటి? వారెందుకలా రియాక్టు అయ్యారు అన్న విషయంలోకి వెళితే..

ఏపీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారు. వివిధ కారణాలతో వారు.. విభజన వేళ సొంత రాష్ట్రానికి వెళ్లలేకపోయారు. అలా పని చేస్తున్న వారు ఏపీలో 711 మంది ఉన్నారు. విభజన జరిగి ఆరేళ్లు అయిపోయినా.. తమను తమ రాష్ట్రానికి పంపాల్సిందిగా వారు కోరుతున్నారు. వారి విన్నపాలు పాలకుల చెవికి చేరలేదు. ఇదిలా ఉంటే.. 711 మంది ఉద్యోగుల ప్రతినిధులు తాజాగా సీఎం జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ అభ్యర్థనను ఆయన ముందు ఉంచారు. తాము పడుతున్నకష్టాల్ని జగన్ కు చెప్పుకున్నారు.

వెంటనే స్పందించిన సీఎం జగన్.. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. వారిని ఏపీ నుంచి రిలీవ్ చేసేందుకు ఓకే చెప్పారు. వారిని రిలీవ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సొంత రాష్ట్రానికి వెళుతున్న ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. దీంతో.. తమ రాష్ట్రానికి వెళ్లేందుకు అంగీకరించి.. తమ సమస్యను వెంటనే క్లియర్ చేసిన జగన్ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న మిగిలిన ఉద్య్గోగులు జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి.. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. అలా తెలంగాణ ఉద్యోగులు ఏపీ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Tags:    
  • CM YS Jagan 
  • Andhra Pradesh 
  • Ap People 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS