• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బిగ్ బ్రేకింగ్ :మే 15...

బిగ్ బ్రేకింగ్ :మే 15 వరకు స్కూళ్ళు - కాలేజీలు మూసివేత?

By - Tupaki Desk
Update: 2020-04-08 07:50 GMT
కరోనా వైరస్ ను దేశంలో అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. కానీ, కరోనా వైరస్ మాత్రం దేశంలో ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప - ఎక్కడా తగ్గుముఖం పట్టినట్టు కనిపించడం లేదు. అలాగే గత వారం రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తే మరింతగా కరోనా విజృంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తారా ...లేఖ పొడగిస్తారా అన్న సందేహాల నడుమ కేంద్ర మంత్రి బృందం ఒక  కీలక ప్రతిపాదన చేసింది.

అదేమిటి అంటే ...దేశంలో అన్ని విద్యాసంస్థలను మరో 4 వారాల పాటు మూసి వేయాలని సూచించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో.. లాక్ డౌన్ పొడిగించాలని తెలంగాణ  - మహారాష్ట్ర  - తమిళనాడు - యూపీ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేసినా - లేకపోయినా కూడా  స్కూళ్ళు - కాలేజీలను నాలుగు వారాల పాటు మూసివేయాలని ఈ బృందం అభిప్రాయపడింది.

అలాగే సమ్మర్ కూడా ప్రారంభమైంది. ఈ సమయంలో ఎక్కువగా  ప్రార్థనా కేంద్రాలు - మతపరమైన కూడళ్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమికూడతారు. అలా జనం  గుమికూడకుండా చూసేందుకు డ్రోన్లను వినియోగించాలని ఈ బృందం సిఫారసు చేసింది.  ఏప్రిల్ 14 తరువాత నాలుగు వారాల పాటు షాపింగ్ మాల్స్ కూడా మూసివేయాలని కూడా అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోమ్ మంత్రి అమిత్ షా - ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇకపోతే వరల్డ్ ఓ మీటర్ ప్రకారం భారత్ లో కరోనా కేసుల సంఖ్య ..5,356 గా ఉంది. 160 మంది కరోనా రోగులు మృతి చెందారు.
Tags:    
  • Schools To Be Closed Till May 15th 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Corona Virus In Andhra Pradesh 
  • Corona Virus 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS