• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నేడే అమెరికా ఎన్నికలు.....

నేడే అమెరికా ఎన్నికలు.. హిల్లరీ హ్యాపీ!

By - Tupaki Desk
Update: 2016-11-08 04:46 GMT
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. మంగళవారం (నవంబర్ 8) జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? వైట్ హౌస్ అధినేత ఎవరు కాబోతున్నారు? ఈ విషయంలో ట్రంప్, హిల్లరీల్లో ఎవరు గెలిస్తే ఎలా ఉంటుందంటూ ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే లాభనష్టాలను బేరీజువేసుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగే ఎన్నికలపై రాయిటర్స్/ఇప్సాస్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన తుది, తాజా సర్వే వెలువడింది. ఈ లాస్ట్ సర్వే ప్రకారం... హిల్లరీకి 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని, ట్రంప్ నకు షాక్‌ తేలింది.

అయితే... ఈ ఎన్నికలకు సంబందించిన ప్రచారం మొదలైన రోజునుంచీ సర్వేలన్నీ హిల్లరీయే ముందంజలో ఉన్నారని ప్రకటిస్తూ వచ్చాయి. దీంతో పాటు అమెరికాలో హిల్లరీకి భారీ మీడియా సపోర్ట్ కూడా ఉండటంతో ఆమె విజయానికి మంచి మద్దతు లభిస్తుందని కథనాలు వచ్చేవి. ఈ క్రమంలో అనూహ్యంగా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణల కారణంగా ఆమె మరింత ముందుకెళ్లిపోయారనే చెప్పాలి. అనంతరం హిల్లరీ విషయంలో "ఈ-మెయిల్స్" సమస్య రావడంతో పోటీ హోరాహోరీగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒక దశలో ట్రంపే, హిల్లరీకంటే స్వల్ఫ తేడాతో ముందున్నారని కూడా ఒక సర్వే చెప్పింది!

అయితే.. ఫైనల్ గా ఎన్నికల తేదీ సమీపించేసరికి పరిస్థితి పూర్తిగా హిల్లరీకి అనుకూలంగా మారింది. ఈ మెయిల్స్ వ్యవహారంలో ఎఫ్. బీ.ఐ హిల్లరీకి క్లీన్‌ చిట్ ఇవ్వడంతో హిల్లరీ గెలిచే అవకాశం 90 శాతానికి పెరిగింది. దీంతో వైట్‌ హౌస్ రేసులో ట్రంప్ ఆశలు ఆల్ మోస్ట్ ఆవిరైపోయినట్లే.

కాగా... అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే ఈ 538 ఓట్లలోనూ అభ్యర్థి తప్పకుండా 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించాలనే విషయం తెలిసిందే. అయితే హిల్లరీ ఈ విషయంలో 303 ఓట్లతో తిరుగులేని మెజార్టీ సాధిస్తారని ట్రంప్ కు 235 ఓట్లు వస్తాయని తేలగా... పాపులర్ ఓట్లు హిల్లరీకి 45 శాతం - ట్రంప్ కు 42 శాతం వస్తాయని అంచనా వేసింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి జరిగే అమెరికా ఎన్నికల్లో దాదాపు 15 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Hillary Clinton 
  • US Elections 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS