• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  1921 నెంబరు నుంచి ఫోన్...

1921 నెంబరు నుంచి ఫోన్ వస్తే..వారు అడిగినవన్ని చెప్పాలి

By - Tupaki Desk
Update: 2020-04-23 01:30 GMT
కరోనా వ్యాప్తి ఎలా ఉందన్న విషయాన్ని తేల్చేందుకు ఏం చేయాలి?  అన్నంతనే.. ర్యాండమ్ గా కరోనా పరీక్షలు నిర్వహించాలన్న సమాధానం వస్తుంది. భారత్ లాంటి దేశంలో అలాంటి ప్రక్రియ చాలా ఖర్చు తో కూడుకున్నదే కాదు.. చాలా క్లిష్టమైనది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అలాంటి ర్యాండమ్ టెస్టులు నిర్వహించే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. అలాంటప్పుడు కరోనా నియంత్రణ ఎలా ఉందన్న విషయం పై అవగాహన పెంచుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ర్యాండమ్ గా కొన్ని ప్రాంతాల్ని ఎంపిక చేసుకొని.. కొందరికి ఫోన్లు చేసి పలు ప్రశ్నలు అడిగి.. వారి నుంచి వచ్చే సమాధానాల ద్వారా కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అన్న విషయం పై అవగాహనకు రావాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ ప్రక్రియలో భాగంగా 1921 నెంబరు నుంచి టెలిఫోన్ సర్వేను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యం లో 1921 నెంబరు నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించాలని.. సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు.. 1921 కాకుండా మరే నెంబరు నుంచి ఫోన్ వచ్చినా.. ఎలాంటి సమాచారాన్ని ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటివరకూ కరోనా లక్షణాల లెక్క తేల్చేందుకు పాలిమెరేజ్ చైన్ రియాక్షన్ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గొంతు.. ముక్కులో నుంచి తీసిన శాంపిల్ ను పరీక్షించటం ద్వారా కరోనా లక్షణాలు ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని నిర్దారిస్తున్నారు. అయితే.. ఈ విధానంలో ఫలితాలు రావాలంటే ఐదారు గంటల సమయం పట్టనుంది. దీంతో.. దానికి బదులుగా రాపిడ్ యాంటీబాడీ టెస్టును నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఫలితం అరగంటలోనే వచ్చేయనుంది.

ఈ నేపథ్యం లో ఇలాంటి కిట్లను చైనా నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఐదు లక్షల కిట్లను చైనా నుంచి తెప్పించి.. కేసులు పెరుగుతున్న వివిధ రాష్ట్రాలకు వాటిని పంపారు. అయితే.. ఈ కిట్ల నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. టెలిఫోనిక్ సర్వే ద్వారా.. కరోనా లక్షణాలు ఏ ప్రాంతంలో ఏ మేర ఉన్నాయన్న విషయాన్ని చెక్ చేసే ప్రయత్నానికి తెర తీశారు.
Tags:    
  • Citizens to get call from 1921 for phone survey on Covid 19 
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS