కేసీఆర్‌ పై పెద్దాయ‌న ధ‌ర్మాగ్రహం

Update: 2016-11-30 06:22 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ప్రముఖ విద్యావేత్త - మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీపీఎం ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన మహాజన పాదయాత్రలో పాల్గొన్న సంద‌ర్భంగా చుక్క‌రామ‌య్య మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని 'ఓ పిచ్చోడి నిర్ణయం' అని తనతో చెప్పిన కేసీఆర్‌ అదే కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతుండడం తాను పత్రికల్లో చదివానని చుక్కా రామ‌య్య‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాస్తుపేరిట ప్రభుత్వ భవనాలను కూల్చుతుండటం కాంట్రాక్టర్లను మేపడం కోసమేనని విమర్శించారు. గ్రామాల్లో విద్య - వైద్యం కొరవడిందన్నారు. విద్య అందితేనే రాష్ట్రాభివృద్ధి చెందేందుకు వీలవుతుందని, దీనికి ఉదాహరణే క్యూబా అధ్యక్షుడి పరిపాలన విధానమని - ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రభుత్వానికి కేసీఆర్‌ సూచించారు. పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వడ్డించే కార్మికులకు 6 నెలల నుంచి వేతనాలివ్వకపోవడం దారుణమని రామ‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనుల్లో కొన్నింటిలో నీరే చేరడం లేదన్నారు.

నోట్ల రద్దుతో సామాన్య పేద ప్రజానికం 15రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చుక్కా రామ‌య్య అన్నారు. నిత్యజీవితంలో సామాన్య ప్రజానికం విద్యా - నిత్యావసర కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దుతో కూలీలకు పని దొరకడం లేదని, ప్యాక్టరీలు మూతపడ్డాయని, వారు దాచుకున్న బ్యాంకులమీద నమ్మకం పోతోందని చెప్పారు. కొత్త నిర్ణయం మూలంగా ఇండియాలో అరువు వ్యాపారం రేపటి నుండి అమలు కానుందన్నారు. దీనివల్ల ఇష్టం వచ్చినట్టు ధరలు రాసుకోవడానికి వ్యాపారులకు అవకాశమిచ్చిందని రామ‌య్య విశ్లేషించారు.

ఇదిలాఉండ‌గా  కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలంగాణ ముఖ్య‌మంత్రిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నీతి తప్పిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు త‌మ‌కు నీతులు చెప్పొద్దంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారంలోకి వచ్చాక వృధా ఖర్చులు చేస్తున్నదెవరో ప్రజలకు తెలుసన్నారు. క్యాంపు కార్యాలయం నిర్మించడం వృథా ఖర్చు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కు మోడీకి రహస్య ఒప్పందం కుదిరిందని - పార్లమెంట్‌ లో టీఆర్‌ ఎస్‌ ఎంపీలు ప్రవర్తించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో సామాన్య ప్రజలు అల్ల కల్లోలం అవుతున్నారని వీహెచ్‌ చెప్పారు. బ్యాంకుల వద్ద ప్రజలు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే... బ్యాంకులు సరిగ్గా పని చేయడం లేదనే చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు. నోట్ల రద్దుపై చంద్రబాబు మోడీకి తప్పుడు సలహా ఇచ్చారని చెప్పారు. అభిమన్యుడిని పద్మవ్యూ హంలోకి పంపినట్లుగా మోడీని ఈ నోట్ల రద్దులో బాబు ఇరికించారని చెప్పారు. నల్లధనాన్ని అరికట్టేందు కు... ఉగ్రవా దులకు వచ్చే డబ్బు నియంత్రించేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మోడీ మాట మార్చి నగదు రహిత లావాదేవీల కోసమేనని చెప్పడం సరైందికాదని మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News