• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సినీ ఇండస్ట్రీలో...

సినీ ఇండస్ట్రీలో మార్పు..జగన్ సీఎం కావాలి..

By - Tupaki Desk
Update: 2018-07-09 08:40 GMT
తెలుగుదేశం పార్టీ పుట్టుకకు సినీ నేపథ్యానికి దగ్గరి సంబంధాలున్నాయి. తెలుగు సినిమా తెరపై వెలుగు వెలిగిన సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లోనే అధికారం చేపట్టారు. కానీ ఆ తర్వాత  టీడీపీని నిజమైన పొలిటికల్ నేత చంద్రబాబు హైజాక్ చేశారు. ఇప్పటికీ అన్నగారిపై అభిమానంతో సినిమా ఇండస్ట్రీలోని ముఖ్యలు టీడీపీలో కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు అదే బాబు వారికి చేదు అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు జగన్ వెంట నడుస్తోంది. పోసాని - కమెడియన్ పృథ్వీ సహా ఎంతో మంది జగన్ పాదయాత్ర వద్దకు వచ్చి ఆయనతో కలిసి నడిచారు. ఇప్పుడు మరో ప్రముఖుడు సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు కూడా జగన్ ను కలిశారు.

జగన్ ప్రజాసంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో ఆయనను పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. మండపేట నియోజకవర్గంలో జరుగుతున్న యాత్రలో జగన్ తో కలిసి కాసేపు నడిచారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చోటా కే నాయుడు మాట్లాడారు. ఏపీలో సుపరిపాలన కావాలంటే జగన్ సీఎం కావాలని స్పష్టం చేశారు.

ఒకరూ.. ఇద్దరూ కాదు.. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. టీడీపీని కాదంటూ వైసీపీకి మరులుతున్నారు. వైఎస్ జగన్ లోని నిజాయితీకి ఫిదా అవుతున్నారు. ప్రజల కోసం వందల కి.మీల పాదయాత్ర చేస్తున్న ఆయన పట్టుదలకు గులాం చేస్తున్నారు. అందరి కష్టాలు తీర్చే నాయకుడు జగన్ అంటూ కొనియాడుతున్నారు.

సినిమా పరిశ్రమలో వచ్చిన ఈ మార్పు వచ్చే 2019 ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇన్నాళ్లు సినీ గ్లామర్ ను పట్టుకొని నెట్టుకొచ్చిన టీడీపీకి వారి నిర్ణయం శరాఘాతంగా మారబోతోంది. వైసీపీ తరఫున పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేసేందుకు సై అంటున్నారు. దీంతో ప్రజల్లో కూడా వైసీపీకి మరింత మైలేజ్ రానుంది. సినీ ప్రముఖుల ప్రచారంతో అభ్యర్థుల విజయావకాశాలు పెరగనున్నాయి. సినీ ఇండస్ట్రీలో వచ్చిన ఈ కొత్త మార్పు వైసీపీకి కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Tags:    
  • Chota K Naidu 
  • YS Jagan 
  • Praja sankalpa Yatra 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS