ఎల్జేపీ అధ్యక్ష పదవి నుంచి చిరాగ్ తొలగింపు

Update: 2021-06-15 16:30 GMT
బీహార్ లో రాజకీయం అనూహ్య మలుపులు తిరిగింది. బీహార్ కు చెందిన లోక్  జనశక్తి పార్టీలో అసమ్మతి చెలరేగింది. పార్టీ అధినేత చిరాగ్ పాశ్వన్ పై మిగతా ఎంపీలంతా తిరుగుబాటు చేశారు. దీంతో పార్టీ అధ్యక్షుడైన చిరాగ్ పాశ్వాన్ తిరుగుబాటు చేసిన ఐదుగురు ఎంపీలను తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

ఈ క్రమంలోనే సదురు ఐదుగురు రెబల్ ఎంపీలు ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి చిరాగ్ ను తొలగిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఈ విషయమై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చిరాగ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు.చిరాగ్ పాశ్వాన్ మద్దతుదారులు ఢిల్లీలోని ఎల్జేపీ కార్యాలయం ముందు పోస్టర్లను చింపిస్తూ హడావుడి చేయగా.. రెబల్ ఎంపీల మద్దతుదారులు పాట్నాలోని ఎల్.జేపీ జాతీయ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.

ఎల్.జేపీ వ్యవస్థాపకులు అయినా రాంవిలాస్ పాశ్వాన్ మరణం అనంతరం పార్టీని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ చేపట్టారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలతో పార్టీ గత బీహార్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అప్పటి నుంచి అసమ్మతి వర్గం అంతర్గతంగా గుర్రుగా ఉంది. తాజాగా చిరాగ్ ను తొలగిస్తూ ఆయన బాబాయ్ ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకొని అందరూ ఎంపీలు తిరుగుబాటు చేశారు. దీంతో ఎల్జేపీలో అసమ్మతి చెలరేగింది.
Tags:    

Similar News