• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  150 కి.మీ....

150 కి.మీ. నడిచి..మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుతుందనగా మృతి!

By - Tupaki Desk
Update: 2020-04-21 14:06 GMT
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కాలినడక కొనసాగిస్తున్నారు. కాగా , తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన 12 ఏళ్ల బాలిక.. 3 రోజుల పాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచి చివరికి ప్రాణాలు కోల్పోయింది.

మరి కొన్ని గంటల్లో సొంత గ్రామానికి చేరాల్సిన ఆ బాలిక కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటికే 150 కిలోమీటర్లు నడిచిన ఆమె, తన గ్రామానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.  దీని పై పూర్తి వివరాలు చూస్తే ..జమ్లో మడ్కమ్ అనే 12ఏళ్ల బాలిక తన కుటుంబాన్ని పోషించేందుకు తెలంగాణలోని ఓ గ్రామంలో కూలీపనులు చేస్తుండేది. అయితే మళ్లీ లాక్ డౌన్ పొడిగిస్తారేమో అన్న ఆందోళనతో ఏప్రిల్-15న జమ్లో...తనతోటి పనిచేసే 11మంది తో కలిసి తన స్వస్థలమైన  చత్తీస్ ఘడ్ లోని బీజాపుర్ జిల్లాకి చేరుకునేందుకు కాలినడక ప్రారంభించింది.

అయితే శనివారం  మధ్యాహ్నాం ఇంటికి ఇంకో 14కిలోమీటర్లు దూరంలో ఉండగా,జమ్లోకి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. కొద్దిసేపటికే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది.  ఆ అమ్మాయికి కరోనా నిర్దారణ పరీక్షలు చేసిన బీజాపూర్‌ కు చెందిన వైద్యులు కరోనా నెగటివ్ అని తేల్చారు. ఆమె పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందిందని వైద్యులు తేల్చారు. కాగా, ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వం బాలిక కుటుంబానికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది.
Tags:    
  • Chhattisgarh girl who died during walk back home from Telangana 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS