• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు సంచలన ప్రకటన.....

చంద్రబాబు సంచలన ప్రకటన.. మరి పొత్తు లేనట్టేనా?

By - Tupaki Desk
Update: 2023-01-16 06:10 GMT
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏపీ సీఎం, వైసీపీ అధినేత  వైఎస్ జగన్‌ వైనాట్‌ 175.. 175 ఎందుకు రావు.. 175కి 175 సీట్లు సాధించాలని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ముఖ్య నేతలకు పిలుపునిస్తున్నారు. నా పని నేను చేస్తున్నా.. సరిగ్గా బటన్లు నొక్కుతున్నా.. మీ పని మీరు చేస్తే 175 సాధించడం సులువే అంటూ జగన్‌ ఉద్భోదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవడానికి బాలయ్య కుటుంబం, తన కుటుంబంతో సహా చంద్రబాబు తన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఘనంగా పండుగ సంబరాలు జరుపుకున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని టీడీపీ శ్రేణులకు ఉద్భోదించారు. మరోవైపు ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు సాధిస్తుందని చెబుతున్నారు.

ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. విశాఖ పరిణామాల తర్వాత జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ను చంద్రబాబు, కుప్పం పరిణామాల తర్వాత చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య అనేక అంశాలు చర్చకొచ్చాయని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పొత్తు దిశగానే ఇరు నేతలు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని పవన్‌ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని పార్టీలు కలసి రావాలని చంద్రబాబు సైతం పిలుపునిచ్చారు.

గతంలో సైతం పొత్తుల విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ తనది వన్‌ సైడ్‌ లవ్‌ అని టూ సైడ్‌ లవ్‌ ఉంటేనే పొత్తులు ఉంటాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ గౌరవప్రదంగా పొత్తులు ఉండాలని వ్యాఖ్యానించారు. గౌరవప్రదంగా ఉంటే మిశ్రమ ప్రభుత్వం వస్తుందని.. లేదంటే జనసేనది ఒంటరి పోరాటమని తేల్చిచెప్పారు.

మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు కుదిరిందని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు జనసేనకు ఇన్ని కేటాయించారంటూ ఒక ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు 175కి 175 స్థానాలు టీడీపీ గెలుచుకోవాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరి జనసేనతో పొత్తు లేనట్టేనా, లేదంటే జనసేనతో కలిపే 175 సీట్లను టీడీపీ, జనసేన సాధించాలనేది చంద్రబాబు ఉద్దేశమా అనేది తెలియడం లేదు. దీనిపైన స్పష్టత రావాల్సి ఉంటుందని అంటున్నారు..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • AndhraPradesh 
  • TDP 
  • ChandraBabuNaidu 
  • SensationalComments 
  • Power 
  • Elections 
  • Janasena 
  • Alliance 
  • Politics 
  • PoliticalNews 
  • TupakiNews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS