• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తల్లితండ్రులకు బాబు...

తల్లితండ్రులకు బాబు పిండప్రధానం..

By - Tupaki Desk
Update: 2016-08-13 12:48 GMT
మరణించిన తమ పూర్వికులకు పుష్కరాల్లో పిండప్రదానం చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తమ పూర్వికులకు పిండప్రదానం చేశారు. అయితే ఈ పుష్కరాల్లో తన తల్లితండ్రులతో పాటు, అత్తమామలకు కూడా చంద్రబాబు పిండప్రదానం చేయడం విశేషం. కృష్ణా పుష్కరాల్లో రెండో రోజైన శనివారం చంద్రబాబు తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ - ఖర్జూరనాయుడులతో పాటు - అత్తమామలు నందమూరి తారకరామారావు - బసవతారకం దంపతులకు ఆయన పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని బాబు ప్రార్థించారు.

పిండప్రదాన కార్యక్రమం అనంతరం అధికారులు - సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. పుష్కర స్నానానికి వచ్చే వికలాంగులు - వృద్ధులకు సాయపడాలని - గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని - యాత్రికులు అందరినీ సంతృప్తిగా పంపాలని స్పష్టం చేశారు. ప్రతిఘాట్‌ వద్ద వాటర్‌ లెవల్‌ ఇండికేటర్లు ఉపయోగించి ప్రతి నిమిషం జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఈ టెలీకాంఫరెన్స్ అనంతరం ఆయన మీడియా మిత్రులకు క్లాస్ తీసుకున్నారు.

కృష్ణా పుష్కరాలపై దుష్ప్రచారం జరుగుతుందని - కృష్ణా జలాలు కలుషితమయ్యే అవకాశం లేనే లేదనే విషయాన్ని మీడియా మరిచిపోకూడదని చంద్రబాబు తెలిపారు. బాధ్యతారాహిత్యంగా ఎవరు వార్తలు రాయొద్దని - అలా రాసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని మీడియా సంస్థలు మాత్రం పుష్కరాలపై దుష్ప్రచారం చేస్తున్నాయని  ఆయన తెలిపారు. ఆ మీడియా సంస్థలు హెచ్చరించినట్లు కృష్ణాజలాలు కలుషితమైతే.. శనివారం కూడా స్వామీజీలు - పీఠాధిపతులు పుష్కరస్నానం చేసిన విషయం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
Tags:    
  • Chandrababu Naidu 
  • Pinda Pradanam 
  • krishna pushkaralu 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS