• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉపముఖ్యమంత్రి..హోం...

ఉపముఖ్యమంత్రి..హోం మంత్రి..మాకే: బాబు డిమాండ్!!

By - Tupaki Desk
Update: 2018-11-14 05:37 GMT
ఆలూ లేదు చూలు లేదు...పదవులు మాత్రం సైకిల్ కే అన్నట్లు ఉంది... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి స్పీడు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ - తెలంగాణ జన సమితి - సీపీఐలతో జత కట్టిన చంద్రబాబుకు తెలంగాణలో విజయం సాధించినట్లుగా నమ్మకం వచ్చేసింది. ఇదీ నిజమవుతుందా..లేక పగటికలగా మారుతుందా అనేది ఫలితాలు వచ్చే వరకూ తేలదు. అయిన చంద్రబాబు నాయుడు మాత్రం మహాకూటమి అధికారంలోకి వస్తే తమకు ఏ పదవులు కావాలో కాంగ్రెస్‌ అధిష్టానం ముందు ఉంచారంటున్నారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు కావాలని చంద్రబాబు నాయుడి డిమాండ్‌ గా చెబుతున్నారు. వీటిలో ఉపముఖ్యమంత్రి పదవి - హోంమంత్రి పదవి ఖచ్చితంగా తెలుగుదేశానికే ఇవ్వాలని చంద్రబాబు నాయుడి ప్రధాన డిమాండ్‌ గా చెబుతున్నారు. ఉపముఖ్యమంత్రి పదవితో పార్టీకి పూర్వవైభవం తీసుకుని రావాలని - హోంమంత్రి పదవితో తనపై ఉన్న ఓటుకు నోటు కేసు మాఫీ చేయించుకోవాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు.

రాహుల్ గాంధీతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ విషయం ప్రస్తావించినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇరుకున పెట్టిందని దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకరించిందని చంద్రబాబు నమ్మకం. తెలంగాణలో మహాకూటమిని అధికారంలోకి తీసుకుని వచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని - తన డిమాండ్లను నెరవేర్చే అంశాన్ని రాహుల్ గాంధీ పరిష్కరించాలని అన్నట్లు సమాచారం. అయితే ఈ డిమాండ్ల పై రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వలేదుంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మహాకూటమిలో అన్ని పక్షాలను సంతృప్తి పరుస్తామని - అలాగే ఓటుకు నోటు కేసు లేకుండా చేస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి హోంమంత్రి ఇవ్వకపోయిన - తన నుంచి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా మారిన రేవంత్ రెడ్డి కైన హోంమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. దీని వల్ల స్వామి కార్యమూ - స్వకార్యము రెండు నెరవేరినట్లు అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మహాకూటమి తెలంగాణలో అధికారంలోకి రాకపోతే ఓటుకు నోటు కేసులో జోక్యం చేసుకుని ఆ కేసును మాఫీ చేయించే బాధ్యత రాహుల్ గాంధీయే తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరినట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణలో ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి - కాంగ్రెస్‌ పార్టీకి కంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మనుగడకే స‌వాల్‌ గా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


Tags:    
  • Chandrababu naidu 
  • Deputy CM 
  • Home Ministry 
  • Mahakutami 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS