రామోజీ ఇంట పెళ్లిలోనే బాబు కేక్ క‌టింగ్‌!

Update: 2019-04-21 05:08 GMT
ప్ర‌ముఖుల ఇంట పెళ్లిళ్ల సంద‌ర్భంగా చోటు చేసుకునే హ‌డావుడి మామూలుగా ఉండ‌దు. అందునా మీడియా మొఘ‌ల్ గా పేరున్న రామోజీరావు ఇంట పెళ్లి వేడుక అంటే మాట‌లా?  ఉప రాష్ట్రప‌తి మొద‌లు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌తో పాటు.. అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు వంద‌లాదిగా ఈ పెళ్లికి  హాజ‌ర‌య్యారు. త‌న తీరుకు కాస్త భిన్నంగా త‌న మ‌న‌మ‌రాలి పెళ్లికి త‌న దిన‌ప‌త్రిక‌లో భారీ ప్రాధాన్య‌త‌నే ఇచ్చారు రామోజీ.

సాధార‌ణంగా వారి ఇంట జ‌రిగే పెళ్లిళ్ల‌కు సంబంధించి ఓ మోస్త‌రు స‌మాచారం.. కాసిన్ని ఫోటోలు మాత్ర‌మే అచ్చేసే తీరుకు భిన్నంగా.. ఈ రోజు ఈనాడు మొయిన్ ఎడిష‌న్ లో పెళ్లి వేడుక‌కు దాదాపు మూడు పేజీల వ‌ర‌కూ స్థ‌లాన్ని కేటాయించారు. ఇక‌.. మినీలో అయితే రెండు పేజీల‌ను ముస్తాబు చేశారు. నిన్న‌టికి నిన్న త‌న డిజిట‌ల్ ఫ్లాట్ ఫాంలో పెళ్లి వేడుక‌ను లైవ్ ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

ఇంత హ‌డావుడిలో ఒక ఆస‌క్తిక‌ర అంశం పెళ్లిలో చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. నిన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బ‌ర్త్ డే కావ‌టంతో.. పెళ్లికి వ‌చ్చిన ఆయ‌న చేత ప్ర‌త్యేకంగా కేక్ క‌ట్ చేయించిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న ఇంట పెళ్లి జ‌రుగుతున్న వేళ‌.. అతిర‌థ మ‌హార‌థుల హ‌డావుడిలోనూ.. బాబు బర్త్ డేను గుర్తు పెట్టుకొని.. ఆయ‌న చేత చిన్న కేక్ ను క‌ట్ చేయించిన వైనం చాలా కొద్దిమంది దృష్టికే వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వ‌చ్చాయి కానీ.. మొయిన్ స్ట్రీమ్ లో మాత్రం రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News