చంద్రన్న కోపం జగన్‌ కు వరమా..?

Update: 2018-08-20 14:30 GMT
ఎన్నికలు వస్తున్నాయంటే..... నాయకుల గండేల్లో గుబులు.....ప్రజలలోకి వెళ్లాలి....వారు మేచ్చినట్లు మాట్లాడాలి. తాము గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారో - ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి. అంతే కాదండీ గతంలో తామే చేసామో కూడా ప్రజలకు చెప్పాలి. అంతే కాదు మనం చేసీన తప్పులు కప్పిపుచ్చుకోవాలంటే - ఎదుటి వారు చేసిన తప్పులను పెద్దవిగా చేసీ చూపించాలి. ఇదంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చేస్తున్న పని ఇదే. వయోభారంతోనో లేక ఓటమి భయంతోను ఆయన చేస్తున్న తప్పులు ప్రతిపక్షానికి ఎంతో మేలు జరుగుతోంది. 2014 ఎన్నికలలో ప్రత్యేక హోదా - బంగారు ఆంధ్రప్రదేశ్ - విశాఖకు రైల్వే జోన్ వంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ - వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయింది. అంతే కాకుండా ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కేంద్రం దగ్గర ఇవన్నీ సాధించుకునే అవకాశాన్ని కోల్పోయారు. అంతే కాకుండా ప్రత్యేక హోదా వద్దూ - ప్యాకేజీయే ముద్దు అంటూ ప్యాకేజీకి ఓటు వేసినా బాబు - ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రత్యేక హాదా అంటూ మాట మార్చారు. తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడం ఎలాగో తెలియక - ప్రతిపక్ష నాయకుడైన - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా వారి కుటుంబాన్ని కూడా రోడ్డుకు ఈడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డి తన ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శించనప్పటికీ ఆయన కుటుంబాన్ని  ఏనాడు విమర్శించలేదు జగన్ మోహన రెడ్డి లోని ఈ పాజిటివ్ ఎంగిల్ ను ప్రజలు గుర్తించారు. అధికారం కోసం చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలు జగన్‌ కు పాజిటివ్‌ గానే మారుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు జగన్‌ పేరును పదే పదే చెప్పడంతో ప్రజలలోకి జగన్‌ పేరు ఎక్కువగా వెలుతోంది -  వైరభక్తితో జగన్‌ పై చంద్రబాబు చేస్తున్న ఈ నెగటివ్ ప్రచారం - వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ కు పాజిటివ్‌ గా మారుతోందని విశ్లేషకులు అంటున్నారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు జగన్ మోహన రెడ్డి భార్య భారతిని లాగడంతో ప్రజలలో జగన్‌ మీద సానుభూతి పెరిగి - వచ్చే ఎన్నికలలో చంద్రబాబుపై నెగటివ్ ఓటు జగన్‌ కు పాజిటివ్ ఓటుగా మారే అవకాశాలు మేండుగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.




Tags:    

Similar News