తెలుగు సీఎంలకు 'డబుల్' కష్టం
ఏపీ - తెలంగాణ ముఖ్యమంత్రులకు రెండు అంకెతో చాలా ప్రాబ్లం వచ్చిపడింది. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రకటించినా ఆచరణలో ఇబ్బందులు వస్తున్నాయి. అదే సమయంలో ఏపీలోనూ ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అన్ని రంగాల్లో డబుల్ డిజిట్ వృద్ధి సాధించాలన్న అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించడం లేదు.
సాధారణంగా ఏడాదికోసారి వృద్ధిని లెక్కించుకునే పద్ధతికి భిన్నంగా ఎపిలో త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించి సీఎం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ ఒత్తిడి అధిగమించలేని అధికారులు లేని వృద్ధిని ఉన్నట్లుగా చూపిస్తూ అంకెల గారడీకి దిగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఏడు మిషన్ల అమలులోనూ అధికారులు ఇస్తున్న నివేదికలకు, వాస్తవ ప్రగతికీ భారీ తేడా ఉరటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రణాళిక శాఖ మాత్రం అంత వృద్ధి లేదని, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
ఇక తెలంగాణ విషయానికొస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. టిఆర్ ఎస్ ప్రకటించిన హామీల్లో ఈ ఇళ్ళు ప్రధానమైనవి. నియోజకవర్గానికి 400 ఇళ్లు నిర్మించాలని సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం తన మెడకే చుట్టుకొనేలా ఉంది. ఎటూ చాలవని ప్రజలు అంటున్నారు. నియోజకవర్గానికి 400 ఇళ్లే ఇవ్వడం వల్ల ఏమాత్రం లాభం ఉండదని చెబుతున్నారు. అయితే... అంతకంటే ఆ సంఖ్య పెంచేందుకు నిధులు అనుకూలించక టీ ప్రభుత్వం సెలైంటుగా ఉంటోంది.