• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మైలేజ్ కోసం భార్యతో...

మైలేజ్ కోసం భార్యతో రోడ్డునపడ్డ చంద్రబాబు..!

By - Tupaki Desk
Update: 2020-01-01 14:15 GMT
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన గండరగండరుడు లేడని రాజకీయవర్గాల్లో చర్చ ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ  బలమైన తెలుగు మీడియా ఆయన చేతిలోనే ఉంది.ఇక 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కేసులు కాకుండా తప్పించుకున్న నేర్పరి తనం ఆయన సొంతమంటారు. అడ్డంగా దొరికిన ‘ఓటుకు నోటు’ కేసు కూడా అతీగతీ లేకుండా పోయింది.. అలాంటి బాబుకు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకోవాలో తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని అంటారు.

తాజాగా అమరావతిలో నూతన సంవత్సరం వేళ బాబు గారు తొలిసారి తన భార్య భువనేశ్వరిని రోడ్డుమీదకు తీసుకొచ్చాడు.  తన పత్ని భువనేశ్వరితో కలిసి సకుటుంబ సపరివారంగా అమరావతి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాడు.  జగన్ ప్రభుత్వంపై సమరానికి సై అన్నారు.

తనకు రాజకీయ మైలేజ్ నిచ్చే ఏ సమస్యనైనా తెలివిగా వాడుకోవడంలో చంద్రబాబును మించి నేత లేరంటారు.అందుకే 40 ఏళ్లుగా బాబు రాజకీయంలో ఉన్నా ఆయన భార్య భువనేశ్వరి  వ్యాపారాలకే పరిమితమయ్యారు తప్పితే బాబుతోపాటు రాజకీయాలు చేయేలేదు. తాజాగా అమరావతిలో మహిళల ఆందోళనల్లో భార్యను తీసుకొచ్చి చంద్రబాబు సెంటిమెంట్ రాజేశారు.

తన భర్త చంద్రబాబు సొంత కుటుంబాన్ని విస్మరించి ప్రజల కోసం పాటుపడుతున్నాడని.. మీకు అండగా ఉంటాడని భువనేశ్వరి అన్న మాటలు ఆందోళనలు చేస్తున్న మహిళలను కదిలించాయి. ఇలా బాబు గారు రాజకీయం కోసం భార్యను తీసుకొచ్చి అమరావతిలో మహిళా ఆందోళనకారులను సంతృప్తిపరిచిన తీరు చూసి అందరూ ముక్కునవేలేసుకున్నారు.బాబు గారి బుర్రే బుర్ర అంటూ ఆశ్చర్యపోయారట..
Tags:    
  • Chandrababu naidu 
  • Bhuvaneshwari 
  • Amaravati 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS