ఆపద్ధర్మం అంటే!... అస్సలు నచ్చట్లేదబ్బా!
టీడీపీ అధినేత, ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన అనుచర గణం ఇప్పుడు చాలా విచిత్రంగానే వ్యవహరిస్తోందని చెప్పాలి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ మంత్రి, ఆపద్ధర్మ ప్రభుత్వం... మొత్తంగా ఇప్పుడు బాగా వినిపిస్తున్న ఆపద్ధర్మ అనే పదంపై బాబు అండ్ బ్యాచ్ విరుచుకుపడుతోంది. ఆ పదం వింటేనే తోక తొక్కిన పాములా బుసలు కొడుతున్న టీడీపీ నేతలు... అసలు ఆపద్ధర్మం అనే పదం రాజ్యాంగంలో ఎక్కడుందో చూపించాలంటూ తమదైన వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేవగా... ఆసలు ఆపద్ధర్మంపై మనమూ ఓ లుక్కేద్దాం పదండి.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా... ఆ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరగాలని, ప్రజలు తమకు ఇష్టమైన నేతను, పార్టీని ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వాలన్న సదుద్దేశంతో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసిన రాజ్యాంగ రచయితలు... ఎన్నికల సమయంలో దానికి సర్వాధికారాలు కట్టబెట్టారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రజా ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి. అధికారుల పాత్ర ఏమిటి? ఈసీ పరిధి ఎంత? ఈ తరహా అంశాలన్నింటినీ క్లిస్టర్ క్లియర్ గానే ప్రస్తావించింది. ఎన్నికల సమయంలో అప్పటిదాకా కొనసాగిన ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉన్నాయి. సాధారణ సమీక్షలు కూడా చేపట్టరాదని, కొత్త నిర్ణయాలు తీసుకోరాదని, అధికారం యంత్రాంగం మొత్తం ఈసీ ఆదేశాలనే పాటించాలని, రాజ్యాంగం చెబుతోంది.
మొత్తంగా ఓటరును ప్రభావితం చేసే ప్రజా ప్రభుత్వాలను దాదాపుగా రద్దు సుప్త చేతనావస్థలో పెట్టేసినట్టేనని చెప్పాలి. ఏదేని అత్యవసర పరిస్థితి వస్తే తప్పించి సీఎం సమీక్షలు నిర్వహించడానికి వీల్లేదని కూడా చాలా స్పష్టంగానే చెప్పింది. మొత్తంగా కోడ్ అమల్లోకి వచ్చిందంటే... ప్రజా ప్రభుత్వం అధికారాలకు భారీ కోతలు పడిపోయినట్టేనన్న మాట. అయితే ఇలాంటి పరిస్థితికి రాజ్యాంగ నిర్మాతలు ఓ నిర్దిష్టమైన పేరును మాత్రం సూచించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రతి సారి ఈ తరహా పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో నిపుణులు దీనికి ఆపద్ధర్మం అనే పదం సరిపోతుందని భావించారు. అదే పదాన్ని వాడుతూ వచ్చారు. సీఎంగా ఉన్నా... అధికారాలన్నీ కత్తెర పడిపోయిన సీఎంను ఆపద్ధర్మ సీఎంగానే పిలుస్తున్నారు. ఇప్పటిదాకా దీనిపై ఏ ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పిన దాఖలా కూడా లేదనే చెప్పాలి.
అయితే మొట్టమొదట ఈ పదంపై చంద్రబాబు తనదైన శైలి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వైనం ఇప్పుడు నిజంగానే విచిత్రంగా ఉందని చెప్పక తప్పదు. తాను ఆపద్ధర్మ సీఎంను కాదని పదే పదే చెబుతున్న చంద్రబాబు... ఏపీకి తాను సీఎంనేనని చెబుతున్నారు. చంద్రబాబును సీఎం కాదని ఎవరూ అనలేదు కదా... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ మేరకు అధికారాలకు కత్తెర పడిపోయిన ముఖ్యమంత్రి అనే కదా అంతా అంటున్నారు. అయినా కూడా చంద్రబాబును ఆపద్ధర్మ సీఎం అనకూడదట. అలా ఎవరన్నా అంటే... అసలు ఆపద్ధర్మం అనే పదం రాజ్యాంగంలో ఎక్కడుందో చెప్పాలంటూ చంద్రబాబు అండ్ కో తమదైన శైలి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ తరహా కొత్త కొత్త పోరాటాలు ఈ నె 23న ఫలితాలు వెలువడే దాకా తప్పేలా లేవన్న మాట.