కారు నంబర్ గా.. 'ఏపీ సీఎం జగన్'

Update: 2020-05-31 10:57 GMT
అధికారంలో ఉంటే తాము ఏం చేసినా చెల్లుతుందన్న ధీమా నాయకుల్లో ప్రస్ఫూటంగా కనిపిస్తోంది. పోలీసులు ఏం చేయరు లే అన్న ధైర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చట్టం అధికారంలో ఉన్న వారికి చుట్టంగా ఉంటుందా అన్న అనుమానాలు ఈ ఘటనతో కలుగుతున్నాయి.  అధికార పార్టీ నేతలతో ప్రేమగా.. ప్రతిపక్ష నేతలతో కఠువుగా పోలీసులు ఉంటారా అన్న ఆరోపణలున్నాయి.  

మామాలుగా ఎవరైనా నంబర్ ప్లేటు లేకుండా.. లైసెన్స్ లేకుండా రోడ్డెక్కితే ఆపి మరీ ఫైన్స్ వేసే పోలీసులు ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో మాత్రం చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఏపీలో అలాంటి వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సొంత కారు నంబర్ ప్లేటు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే మరీ.

శనివారం అంబాజీపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే కొండేటి ఆయన సొంతకారులో చిట్టిబాబు హాజరయ్యారు. ఆ కారు నంబర్ ప్లేటుపై ‘ఏపీ సీఎం జగన్’ అని రాసి ఉండడం అందరినీ దృష్టిని ఆకర్షించింది. అధికార పార్టీ నేతలకు రూల్స్ వర్తించవా అని కొందరు సెటైర్లు కూడా వేశారు.


Tags:    

Similar News