భారత విమానాలపై నిషేధాన్ని ఎత్తేసిన కెనడా...కండిషన్స్ అప్లై !
కరోనా వైరస్ మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పట్టడం తో నెమ్మదిగా ట్రావెల్ ఆంక్షలు తొలుగుతున్నాయి. అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. తాజాగా కెనడా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ట్రావెల్ ఆంక్షలు కొనసాగాయి. ఇంచుమించు అన్నిదేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని విధించాయి. ఇప్పుడు కరోనా సంక్రమణ తగ్గుముఖం పట్టడంతో తిరిగి రాకపోకల్ని పునరుద్ధరిస్తున్నారు. ట్రావెల్ ఆంక్షల్ని సరళీకరుస్తున్నారు. నిషేధాన్ని ఎత్తివేస్తున్నారు.
ఇప్పుడు ఇండియా నుంచి దాదాపుగా విదేశాలకు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా కెనడా ప్రభుత్వం భారత విమానాలపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఏప్రిల్ నెలలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు కెనడా భారత విమానాలపై నిషేధాన్ని విధించింది. ఇప్పుడు అంటే సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇండియా నుంచి నేరుగా విమానాల రాకపోకలకు అనుమతిచ్చింది. అయితే ప్రయాణానికి 18 గంటల ముందుగా ప్రయాణీకులు ఢిల్లీ విమానాశ్రయంలోని అధీకృత ల్యాబ్ నుంచి చేయించుకున్న కోవిడ్ 19 నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. కెనడా ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి భారత హై కమీషనర్ అజయ్ బిసారియా హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఢిల్లీ-టోరంటో మధ్య డైలీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇతర దేశం మీదుగా కెనడా వెళ్లే భారత ప్రయాణీకులు మాత్రం మూడవ దేశంలో తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ హై కమిషనర్ అజయ్ బిసారియా హర్షం వ్యక్తం చేశారు. 27వ తేదీ (సోమవారం) నుంచి ఢిల్లీ-టొరంటో/వాంకోవర్‌ల మధ్య రోజువారీ సర్వీసులు మొదలవుతాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ కొన్ని ఆంక్షలు మాత్రం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కెనెడా వెళ్లే ప్రయాణికులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇంతకా నిబంధనలు ఏంటంటే..
ప్రయాణానికి 18 గంటలకు ముందుగా ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలోని అధీకృత ల్యాబ్ నుంచి చేయించుకున్న కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. వేరే దేశం మీదుగా కెనడాకు వెళ్లే భారత ప్రయాణికులు కూడా మూడో దేశంలో పొందిన కోవిడ్–19 నెగెటివ్ సర్టిఫికెట్ ను ముందుగా చూపించాల్సి ఉంటుంది.రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు సంబంధిత వివరాలను ఆరైవ్‌క్యాన్ మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పైన తెలిపిన నిబంధనలు పాటించిని వారిని అధికారులు బోర్డింగ్ సమయంలో విమానంలో అనుమతించరు.