నవాజ్ షరీఫ్ ఇంట్లో పెళ్ళికి మోడి వెళ్ళచ్చా ?

Update: 2022-05-05 14:12 GMT
నేపాల్ దౌత్యవేత్త ఇంట్లో పెళ్ళికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి హాజరవ్వటం ఎంత దుమారం రేగిందో అందరు చూసిందే. చైనా మహిళా దౌత్యవేత్తని రాహుల్ నేపాల్ పబ్బులో కలిశారంటు బీజేపీ నేతలు నానా రచ్చ చేశారు. చివరకు ఆమె చైనా దౌత్యవేత్తకాదని నేపాల్ దౌత్యవేత్త కూతురు పెళ్ళికి వచ్చిన పెళ్ళికూతురు ఫ్రెండని తేలినా బీజేపీ నేతలు తమను తాము సమర్ధించుకుంటు ఇంకా గోల చేస్తునే ఉన్నారు.

ఇదే విషయమై రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కొన్ని ప్రశ్నలను సంధించారు. నేపాల్ దౌత్యవేత్త కూతురు వివాహానికి రాహుల్ గాంధీ హాజరవ్వటాన్ని బీజేపీ నేతలు తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. దౌత్య సంబంధాలు వేరు, వ్యక్తిగత పరిచయాలతో శుభకార్యక్రమాలకు హాజరవ్వటం వేరన్నారు. ఎవరైనా తమింట్లో పెళ్ళికి రమ్మని పిలిచినపుడు ఎంతటి శతృవులైనా హాజరుకాకుండా ఉండరన్నారు. ఆహ్వానించినపుడు వివాహాలకు హాజరవ్వటం మన సంప్రదాయమన్నారు.

నిజంగా రాహూల్ వివాహానికి హాజరవ్వటం తప్పే అయితే నరేంద్రమోడి చేసింది ఇంకా తప్పన్నారు. ఎలాగంటే పాకిస్ధాన్ ప్రధానమంత్రిగా నవాజ్ షరీఫ్ ఉన్నపుడు ఆయన మనవరాలు వివాహానికి నరేంద్రమోడి ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్ధాన్ పర్యటనలో ఉన్న మోడి చెప్పాపెట్టకుండా పాకిస్ధాన్ లో జరిగిన షరీఫ్ మనవరాలు పెళ్ళికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ఎందుకంటే వివాహానికి హాజరవ్వమని మోడీని  షరీఫ్ అసలు పిలవనేలేదన్నారు.

పిలవకపోయినా మోడి వివాహానికి హాజరవ్వచ్చు కానీ పిలిచినా రాహుల్ మాత్రం వివాహానికి హాజరుకాకూడదా అంటు బీజేపీ నేతలను ప్రొఫెసర్ ఘాటుగా ప్రశ్నించారు. నేపాల్లో రాహుల్ హాజరైన వివాహ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తన కుమార్తె వివాహానికి తాము పిలిస్తేనే రాహుల్ హాజరైనట్లు పెళ్ళికూతురు తండ్రి ప్రకటించిన విషయాన్ని ప్రొపెసర్ గుర్తుచేశారు. పైగా ఆ పెళ్ళికూతురు జర్నలిస్టుగా ఢిల్లీలో 12 ఏళ్ళు పనిచేసి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకున్న విషయాన్ని ప్రొఫెసర్ గుర్తుచేశారు.
Tags:    

Similar News