బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్ కరోనా పాజిటివ్ !

Update: 2020-10-26 06:45 GMT
కరోనా మహమ్మారి జోరు రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో  ప్రజలందరిలో భయాందోళన నెలకొంటుంది. సామాన్యుల నుండి సెలబ్రిటీలు , ప్రముఖులు అనే తేడా లేకుండా అందరిపై ఈ మహమ్మారి  పంజా విసురుతుంది. కరోనా భారిన పడిన ఎంతోమంది ప్రముఖులు సైతం కోలుకోలేక కన్నుమూశారు. అయితే కేవలం అధికారులతో ఆగకుండా ఏకంగా దేశ అధ్యక్షులను సైతం హడలెత్తించింది ఈ మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే వరుసగా పలు దేశాల అధ్యక్షులు , పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రజలందరికీ కరోనా పై అవగాహన కల్పిస్తూ ధైర్యం చెబుతూ ఉండే ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలు కావడంతో ఆయా దేశాల ప్రజలు మరింత ఆందోళనలో మునిగిపోతున్నారు.

ఇకపోతే , ఇప్పటికే  దేశాల అధ్యక్షులు కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా మరికొన్ని దేశాల అధ్యక్షులు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో బల్గేరియా ప్రధాని కూడా చేరారు. బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్ కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన ఓ ప్రభుత్వాధికారితో సమావేశం కావడంతో బల్గేరియా ప్రధాని బోయికో కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌ లో ఉన్నట్టు తెలిపారు. తన కార్యక్రమాలన్నిటిని వాయిదా వేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, బల్గేరియా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 37,562 కరోనా కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News