• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సగం జీతమే ఎక్కువ అంటున్న...

సగం జీతమే ఎక్కువ అంటున్న ఎంపీ ..ఎవరంటే ?

By - Tupaki Desk
Update: 2019-12-23 08:46 GMT
నదియా విటామ్.. బ్రిటన్ పార్లమెంటు లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ. మొన్నటి ఎన్నికలకు ముందు ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు. కానీ , ఎన్నికల తరువాత ఇప్పుడు ఆమె పేరు మారుమోగిపోతుంది. తాజాగా ఆమె చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఆమె తీసుకున్న ఆ సంచలనమైన నిర్ణయం ఏమిటి అని అనుకుంటున్నారా ..సాధారణంగా రాజకీయ నేతలు వీలైన కాడికి నొక్కేసి తమకి , తమ పిల్లల , పిల్లల తరాలకి సరిపడేలా కూడబెడుతుంటారు. కానీ , ఈమె మాత్రం తనకి ఏడాదికి వచ్చే మొత్తం జీతం లో సగం జీతం నాకు చాలు అని చెప్పి అందరిని షాక్ కి గురైయ్యేలా చేసింది.

బ్రిటన్ పార్లమెంటు రూల్ ప్రకారం ఆమె జీతం..80 వేల పౌండ్ల (సుమారు రూ. 73.98 లక్షల) ..కానీ,  తన వార్షిక వేతనంలో 35 వేల పౌండ్లు (సుమారు రూ.32.36 లక్షలు) మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. ఎందుకు అంటే బ్రిటన్ జాతీయ గణాంక కార్యాలయం లెక్కల ప్రకారం అక్కడ సగటు కార్మికుడి వేతనం ఏడాదికి 35 వేల పౌండ్లని.. కాబట్టి తానూ ఏడాదికి అంతే తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశానని ఆమె చెప్పారు. మిగతా మొత్తాన్ని తన నియోజకవర్గంలో నిధులు లేక ముందుకు సాగని పనుల పూర్తికి,  ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

ఈ విషయంలో నేను దాతృత్వం చాటుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేయడం లేదని.. ఆర్థిక సంక్షోభం తరువాత కోతల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వరంగ ఉద్యోగులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారామె. 35000 పౌండ్లే తాను తీసుకుంటున్నాననంటే ఎంపీలు అంతకంటే ఎక్కువ జీతానికి అర్హులు కారని కాదని.. అయితే, టీచింగ్ అసిస్టెంట్లు, నర్సులు, ఫైర్ ఫైటర్లు వంటివారు ఇంతే పొందుతున్నారని అన్నారు. వారికి దక్కాల్సినంత వేతనం దక్కినప్పుడు తాను కూడా ఎక్కువ జీతం తీసుకుంటానని.. తన నిర్ణయం వేతనాల పై చర్చకు దారితీస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఆమె బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తరువాత సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో నెటిజనులు ఆమెను అభినందించారు. అయితే, తన జీతంలో అధిక భాగాన్ని వదులుకోవాలన్న ఆమె నిర్ణయం మాత్రం అందరినీ ఆకట్టుకోలేదు. కొందరు నేతల నుంచీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, నదియా మాత్రం తాను తీసుకున్న నిర్ణయం ఎంపీల విలువను తగ్గించేదేమీ కాదని అన్నారు.
Tags:    
  • Britains youngest MP vows to take home less than half salary 
  • Nadia Whittome 
  • Britain Mp Salary 
  • Telugu News 
  • Telugu Daily News 
  • Telugu Political Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS