• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గంభీర్ కోసం అమ్మాయిలు అలా...

గంభీర్ కోసం అమ్మాయిలు అలా చేశారు

By - Tupaki Desk
Update: 2016-09-12 04:39 GMT
అభిమానం ఏమైనా చేసేలా చేస్తుంది. టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోసం నలుగురు అమ్మాయిలు చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తన పేలవ ప్రదర్శనతో టీమిండియాలో స్థానం కోల్పోయిన గంభీర్ ఇప్పుడు తన ఆటతో మళ్లీ జాతీయజట్టులో స్థానం కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో తన ఆటతో సెలెక్టర్ల మనసు దోచుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గంభీర్ కోసం  దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నలుగురు అమ్మాయిలు చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

నొయిడాలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ నుచూసేందుకు స్టేడియంకు వచ్చిన ఈ నలుగురు అమ్మాయిలు.. 20 అడుగుల పెద్ద బ్యానర్ ను తీసుకొచ్చి ఎర్రటి ఎండలో అందరికి కనిపించేలా తమ బ్యానర్ ను ప్రదర్శించారు. ఈ బ్యానర్ సారాంశం ఏమిటంటే.. గంభీర్ ను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ కోసం నలుగురు అమ్మాయిలు పడిన శ్రమ కొంతమేర ఫలించిందని చెబుతున్నారు. స్టేడియంలో ఆటను చూస్తున్న సెలెక్టర్లు.. ఈ బ్యానర్ ను చూడటం.. దాని గురించి ఆరా తీయటం కనిపించింది.

నిబంధనల ప్రకారం తన అభిమానుల్ని కలిసే అవకాశం లేకపోవటంతో..సిబ్బందికి చెప్పి.. వారికి మంచినీళ్లు అందేలా చూశారు గంభీర్. తన కోసం ఎర్రటి ఎండలో నిలబడి బ్యానర్ పట్టుకున్న కష్టాన్ని ఎంతోకొంత తగ్గించేందుకు ట్రై చేశారు గంభీర్. ఏమైనా ఒక క్రికెటర్ కోసం నలుగురు అమ్మాయిలు పడిన కష్టం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. మరి.. బ్యానర్ తోనే టీమిండియాలో ఆడే ఛాన్స్ దక్కుతుందా? అన్నది ఒక ప్రశ్న. తన ఆటతో గంభీర్ జాతీయ జట్టులో స్థానం దక్కించుకొని తనను అభిమానించే వారి మనసుల్ని దోచుకోవాలని ఆశిద్దాం.
Tags:    
  • Gautam Gambhir 
  • Team Selection 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS