బ్రేకింగ్ : సీఎం జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Update: 2023-01-30 17:55 GMT
ఏపీ సీఎం జగన్ పెనుప్రమాదం తప్పింది. ఆయన విమానాన్ని అత్యవసరంగా  గన్నవరం విమానాశ్రయంలో దించేశారు. ఢిల్లీ వెళ్లే సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం బయలు దేరిన కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్.. అత్యవసరంగా గన్నవరం ఎయిర్ పోర్టులోనే ల్యాండింగ్ చేశారు.

ప్రస్తుతం నిపుణులు విమాన లోపాన్ని గుర్తించి సరిచేసే పనిలో ఉన్నారు.  విమాన ఇంజిన్ లో లోపమా? లేక మారేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది.

జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించాక జగన్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అధికారులు అత్యంత భద్రంగా తీసుకుంటున్నారు. జగన్ ఎక్కువగా విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. రాష్ట్రంలో వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు.

ప్రస్తుతం జగన్ విమానానికి అత్యవసర ల్యాండింగ్ అనగానే వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డారు. క్షేమంగా కిందకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News