• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆదాయంలో సరిలేరు...

ఆదాయంలో సరిలేరు బీజేపీకెవ్వరూ.!

By - Tupaki Desk
Update: 2020-01-10 06:07 GMT
ఒక రాజకీయ పార్టీ నడవాలంటే దానికి విరాళాలు తప్పనిసరి. ఇక టికెట్లు తీసుకునే నేతలు ఎంతో కొంత పార్టీ అధిష్టానానికి విరాళాలుగా ఇచ్చి ఆ సీట్లు కొల్లగొడుతారు. ఇది అనాదిగా జరుగుతున్న ప్రక్రియే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ కి కోట్లకు కోట్లు విరాళాలు వస్తుంటాయి. ప్రభుత్వాలతో పని ఉండే పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు.. సీట్లు ఆశించే ఆశావహులు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తుంటారు.

ఈ కోవలోనే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలను ఎలక్షన్ కమిషన్ కు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సమర్పించింది. ఆ పార్టీ సమర్పించిన ఆఫిడవిట్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం. ఎందుకంటే ఏకంగా బీజేపీకి 134శాతం ఆదాయం పెరగడం విశేషం.

2018-19 ఆర్థిక  సంవత్సరానికి  మొత్తం 2410 కోట్ల ఆదాయం బీజేపీకి రాగా.. 2017-18లో ఆదాయం కేవలం 1027 కోట్లు మాత్రమే. అంటే ఒక్క ఏడాది లోనే బీజేపీ ఆదాయం ఏకంగా 1400 కోట్ల కు పైగానే పెరగడం విశేషం.

ఇక బీజేపీ ఖర్చు కూడా భారీగానే  పెట్టింది. ఎన్నికల సంవత్సరమైన 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1005 కోట్లు ఖర్చు చేసినట్టు ఎలక్షన్ కమిషన్ కు బీజేపీ లెక్కలు చూపింది.

ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆదాయం కేవలం 918 కోట్లు మాత్రమే. 2017-18లో కాంగ్రెస్ ఆదాయం 199 కోట్లే. 2018-19 ఎన్నికల వేళ మాత్రం 918 కోట్ల ఆదాయం వచ్చింది. ఖర్చులు 470 కోట్లుగా చూపెట్టింది. అధికారం కోల్పోవడంతో ఐదేళ్లలో కాంగ్రెస్ ఆదాయం గణనీయంగా పడి పోయింది.
Tags:    
  • BJP richest political party In India 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Political News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS