బీహార్ లో మోడీ బ్యాచ్ దే విజయమట

Update: 2015-10-08 09:24 GMT
ఎన్నికల వేళ సర్వే మాటలు ఓట్లు రాలుస్తాయో లేదో కానీ.. పార్టీల్లో మాత్రం అంతులేని విశ్వాసాన్ని కల్పిస్తాయి. గెలుపు పక్కా అని సర్వు ఉటంకిస్తే.. వారి దూకుడు వేరుగా ఉంటుంది. బిహార్ ఎన్నికల ప్రక్రియ మొదలైన సమయంలో ఎన్డీయే పక్షానికి విజయ అవకాశాలు అంతంతమాత్రమే అన్నట్లుగా పలు సర్వేలు తేల్చాయి.

నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నంతలో పరిస్థితుల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా జరిపిన ఒక సర్వేలో బీజేపీ కూటమి విజయం తథ్యమని తేల్చటం ఆ పార్టీకి మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనటంలో సందేహం లేదు.

243 అసెంబ్లీ సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 147 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాజాగా జరిపిన సర్వే ఒకటి పేర్కొంది. జీ మీడియి నిర్వహించిన  ఈ సర్వేలో బీజేపీ కూటమికి 147 స్థానాలు లభిస్తే.. జేడీయూ.. ఆర్జేడీ.. కాంగ్రెస్ పార్టీలకు 64 సీట్లు మాత్రమే వస్తాయని.. మరో 32 స్థానాల్లో మాత్రం హోరా హోరీ పోరు తప్పదని తేల్చాయి. హోరాహోరీ సీట్ల ఫలితాలు ఎలా ఉన్నా.. అంతిమంగా మాత్రం మోడీ బ్యాచ్ దే విజయమన్న విషయాన్ని తాజా సర్వే స్పష్టం చేసింది.
Tags:    

Similar News