మోడీ ఆప‌శోపాలు.. యూపీ ఓట‌మి ప‌సిగ‌ట్టారా?

Update: 2022-03-06 07:44 GMT
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌రప్ర‌దేశ్‌లో తిరిగి అధికారం ద‌క్కించుకోవాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీ ఆశ‌లు అడియాస‌లు కానున్నాయా?  ఇక్క‌డ బీజేపీ గెలుపు సాధ్యం కాద‌నే సంకేతాలు వ‌స్తున్నాయా? అం టే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ నేత‌లు. బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. బీజేపీ నేత‌ల మ‌ధ్య గుస గుస మాత్రం ఇదే వినిపిస్తోంది.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో సోమ‌వారంతో ఎన్నిక‌లు ముగియ‌నున్నాయి. సోమ‌వారం యూపీలో 7వ ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 54 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నా యి.

అయితే.. ఇక్క‌డ గెలిస్తేనే.. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రంలో గెలుపు గుర్రం ఎక్కి.. ఢిల్లీలో అధికారం తెచ్చుకు నేందుకు అవ‌కాశం ఉంటుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అందుకే బీజేపీఇక్క‌డ తిరిగి అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

అయితే.. సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌.. బీజేపీ పెద్ద‌లకు చేరువ అయిన‌ట్టుగా.. ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోయార‌నేది వాస్త‌వం. అంతేకాదు.. మొత్తం పాల‌న అంతా కూడా కేంద్రం చెప్పిన‌ట్టే న‌డుచుకున్నార‌నే విష‌యం ప్ర‌జ‌ల నుంచే వినిపిస్తోంది. పైగా.. అంద‌రూ స‌ర్వ‌స‌మానంగా ఉన్న ప్ర‌జ‌ల మ‌ద్య అనేక వివాదాలు, విద్వేషాలు కూడాత‌లెత్తింది ఆయ‌న హ‌యాంలోనే.

అందుకే.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీజేపీ యూపీలో ఓడిపోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌చ్చేశాయి. ఈ విష‌యం గ్ర‌హించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. హుటాహుటిన స్పందించారు. 2014 నాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. కేవ‌లం 54 స్థానాల‌కు జ‌ర‌గ‌నున్న 7వ విడ‌త‌ ఎన్నిక‌లను పుర‌స్క‌రించుకుని ఆయ‌న వరుస‌గా రెండు రోజుల పాటు.. ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు.

ప్ర‌జ‌ల‌ను క‌లిశారు. మేధావుల‌తో భేటీ నిర్వ‌హించారు. అదేస‌మ‌యంలో రోడ్డుప‌క్క‌నున్న చాయ్ దుకాణంలోకి వెళ్లి.. చాయ్‌పే చ‌ర్చ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇది 2014 త‌ర్వాత‌.. వ‌చ్చిన ఏ ఎన్నిక‌లోనూ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు, కాంగ్రెస్‌పై ఇటీవ‌ల కాలంలో చేయ‌ని అనేక విమ‌ర్శ‌లు చేశారు. అంధ రాజ‌కీయాలు చేస్తున్న గుడ్డి పార్టీగా కాంగ్రెస్‌ను అభివ‌ర్ణించారు. ప్ర‌తి విష‌యాన్నివిమ‌ర్శిస్తోంద‌ని.. నిప్పులు చెరిగారు. అదేస‌మ యంలో ఖాదీని, యోగాను..తన ఖాతాలో వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తూ.. కాంగ్రెస్‌ను తూర్పార‌బ‌ట్టారు.

ఇంత ప్ర‌యాస నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎప్పుడూ.. మోడీ ప‌డ‌లేద‌నేది నిజం. ప్ర‌స్తుతం బీజేపీ కూక‌టి వేళ్ల‌తో కాక‌పోయినా.. భారీ ఎత్తున న‌ష్ట‌పోయే ద‌శ‌లో ఉంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలోను ప్ర‌జ‌ల్లో మారిన సంకేతాల నేప‌థ్యంలోను.. మోడీ చేసిన ప్ర‌యాస ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.
Tags:    

Similar News