బీజేపీ చేతిలో బాబుకు మూఢిన‌ట్లేనా ?

Update: 2018-06-16 08:20 GMT
పిల్ల‌నిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో చంద్ర‌బాబు నాయుడు ఉమ్మ‌డి రాష్ట్రంలో తొలిసారి ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యాడు. 1999లో రెండో సారి బీజేపీతో క‌లిసి ఎన్నిక‌లకు వెళ్ల‌డంతో  వాజ్ పాయి ఛ‌రీష్మా క‌లిసి వ‌చ్చి మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయ్యాడు. ఆ త‌రువాత గోద్రా అల్ల‌ర్ల‌తో బీజేపీ ప్ర‌తిష్ట మ‌స‌క‌బార‌డం - దేశ‌వ్యాప్తంగా మోడీ మీద విమ‌ర్శ‌లు రావ‌డంతో హైద‌రాబాద్ లో అడుగుపెడితే మోడీని అరెస్టు చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. 2004 ఎన్నిక‌ల్లో తీవ్ర ప్ర‌జావ్య‌తిరేక‌త‌తో అధికారానికి దూర‌మ‌య్యాడు. 2009లోనూ మ‌హాకూట‌మి పేరుతో బ‌రిలోకి దిగినా ఒంటెద్దు పోక‌డ‌లు - పొత్తుపెట్టుకున్న పార్టీల‌ను మోసం చేయ‌డంతో  అధికారంలోకి రాలేక‌పోయాడు.

2014లో తెలంగాణ విభ‌జ‌న‌తో రెండు రాష్ట్రాల్లో అధికారం ల‌క్ష్యంగా బీజేపీతో మ‌ళ్లీ చేతులు క‌లిపాడు. కేంద్రంలో ఎలాగ‌యినా అధికారంలోకి రావాల‌న్న ల‌క్ష్యంతో గ‌తంలో చంద్ర‌బాబు చేసిన ద్రోహాన్ని మ‌రిచిపోయి న‌రేంద్ర‌మోడీ స్నేహ హ‌స్తం అందించాడు. బీజేపీ పొత్తు మూలంగా మోడీ ఛ‌రీష్మా - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం క‌లిసి వ‌చ్చి ఆంధ్రాలో చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా అధికార పీఠం అందుకున్నాడు.

రాష్ట్రంలో - కేంద్రంలో బీజేపీతో అధికారం పంచుకున్న చంద్ర‌బాబు నాయుడు గ‌త నాలుగేళ్లుగా విభ‌జ‌న మూలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌ష్ట‌పోయిందంటూ వేల కోట్లు ఆంధ్రాకు వివిధ ప‌థ‌కాల ద్వారా తీసుకువ‌చ్చి దుర్వినియోగం చేశాడు. రాజ‌ధాని నిర్మాణంతో పాటు పోల‌వ‌రం ప్రాజెక్టు వంటి వాటికి కేంద్రం ఇచ్చిన నిధులు తాత్కాలిక ప్ర‌యోజ‌నాలు అందించే ప‌లు ప‌థ‌కాల‌కు ఖ‌ర్చు చేయ‌డం - అందులో అవినీతికే ప్రాధాన్య‌త ఇచ్చి ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చాడు. నాలుగేళ్ల అనంత‌రం కేంద్రం ఆంధ్ర అభివృద్దికి స‌హ‌క‌రించ‌డం లేద‌ని బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని కేంద్రం మీద బుర‌ద‌జ‌ల్లుతూ త‌న వెన‌క‌టి గుణాన్ని మ‌రోసారి చాటుకున్నాడు.

ఈ నేప‌థ్యంలో బీజేపీ అధిష్టానం చంద్ర‌బాబు మీద తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. గ‌త నాలుగేళ్ల‌లో కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధుల‌కు ఎలాంటి లెక్క‌ప‌త్రాలు చూప‌ని చంద్ర‌బాబు త‌మ‌నే నిందించ‌డాన్ని బీజేపీ ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతుంది. అందుకే గ‌త నాలుగేళ్ల‌లో కేంద్రం నుండి వ‌చ్చిన నిధుల దుర్వినియోగం - రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి కేటాయించిన అనేక నిధుల‌లో అవినీతికి సంబంధించి కీల‌క‌ప‌త్రాల‌ను బీజేపీ అధిష్టానం సేక‌రించిన‌ట్లు తెలుస్తుంది. 2019లో ఆంధ్ర‌లో చంద్రబాబు ఓట‌మే ధ్యేయంగా ఆయ‌న అవినీతిని ప్ర‌చారం చేసి ప్ర‌జాక్షేత్రంలో ఎండ‌గ‌ట్టాల‌ని రంగం సిద్దం చేసిన‌ట్లు తెలుస్తుంది. వ్యూహ‌ - ప్ర‌తివ్యూహాల‌లో స‌మ‌ర్దులుగా పేరున్న మోడీ - అమిత్ షా ద్వ‌యం చేతిలో బాబుకు ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News