• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తన కొడుక్కి తండ్రి ఎవరో...

తన కొడుక్కి తండ్రి ఎవరో చెప్పేసిన నటి కమ్ ఎంపీ

By - Tupaki Desk
Update: 2021-09-17 01:30 GMT
లోక్ సభలోని ఎంపీల్లో భిన్నంగా.. తరచూ విచిత్రమైన వార్తల్లో నిలిచే నాయకురాలు కమ్ నటిగా నుస్రత్ జహాన్ ను చెప్పాలి. బెంగాల్ అధికార పార్టీ అయిన  అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్ సభ సభ్యురాలిగా వ్యహరిస్తున్న ఈ నటి ఈ మధ్యనే పండంటి బిడ్డకు జన్మనివ్వటం తెలిసిందే. భర్తతో వేరుగా ఉన్న ఆమె గర్భం దాల్చటం.. ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని ఆమె బయటపెట్టకపోవటం ఇదో సస్పెన్స్ గా మారటమే కాదు.. పలువురు పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించటం.. ఆమె ఘాటుగా రియాక్టు కావటం తెలిసిందే.

బెంగాలీ నటిగా సుపరిచితురాలైన ఆమె.. తాజాగా తన బిడ్డకు తండ్రిఎవరన్న విషయాన్ని ఆమె చెప్పేశారు. పిల్లాడి జన్మ ధ్రువ పత్రంపై ఆమె తండ్రి పేరును ప్రకటించటం ద్వారా ఇప్పటిదాకా సీక్రెట్ గా ఉన్న విషయం రివీల్ అయిపోయింది. తన బిడ్డకు తండ్రి నటుడు కమ్ రాజకీయ నేత యష్ దాస్ గుప్తాగా ఆమె పేర్కొన్నారు. అయితే.. అదే పేరు ఆమె వెల్లడిస్తారన్న అంచనాలకు తగ్గట్లే.. ఆమె పేరు వెల్లడించటం గమనార్హం.

స్టార్ హోదాను అనుభవిస్తూ  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయటం.. అనూహ్యంగా గెలవటం విశేషంగా చెప్పాలి. ఇదిలా ఉండగా.. తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్ ను టర్కీలో ఆమె పెళ్లాడారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న వేళ.. నుస్రత్ ప్రెగ్నెంట్ అని.. ఆమె బిడ్డతో తనకు సంబంధం లేదని నిఖిల్ జైన్ ప్రకటించటం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. నిఖిల్ జైన్ తో టర్కీలో తనకు జరిగిన వివాహం భారత చట్టాల ప్రకారం చెల్లదని ఆమె ప్రకటించారు. అతనితోతనకు సంబంధం లేదని.. తన డబ్బులన్ని అతడే తీసుకున్నట్లుగా ఆమె ఆరోపించారు. పెళ్లి చెల్లదని తేల్చేసిన వేళ.. విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరన్న విషయాన్ని ఆమె వెల్లడించలేదు. గత ఏడాది లాక్ డౌన్ వేళలో ఒక సినిమా షూటింగ్ సమయంలో నటుడు యష్ దాస్ గుప్తా ప్రేమలో పడినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. యష్ దాస్ గుప్తాకు అప్పటికే పెళ్లై.. పదేళ్ల కొడుకు ఉన్నాడు. అందుకే వీరిద్దరూ పెళ్లి చేసుకునే విషయం కానీ.. మరే విషయాన్ని వెల్లడించలేదంటున్నారు. తాజాగా అతగాడు విడాకులు తీసుకోవటం గమనార్హం. ఈ మొత్తం ఎపిసోడ్ కు అసలు ట్విస్టు ఏమంటే.. టీఎంసీ ఎంపీ నస్రత్ బిడ్డకు తండ్రిగా పేర్కొన్న యష్ దాస్ గుప్తా బీజేపీ నేత కావటం. వాస్తవానికి టీఎంసీకి.. బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి రెండు భిన్న ధ్రువాలైన పార్టీలకు చెందిన నేతల మధ్య ప్రేమ పుట్టటం.. అదికాస్తా మరింత దూరానికి వెళ్లటం విశేషమే. రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    
  • nusrat jahan 
  • tmc mp 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS