• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బిల్ గేట్స్ భార్యకు...

బిల్ గేట్స్ భార్యకు తక్షణం రూ.15000 కోట్ల ఆస్తి

By - Tupaki Desk
Update: 2021-05-06 15:30 GMT
చేసుకుంటే అలాంటి వాడిని చేసుకోవాలి.. విడిపోతే కూడా మునిమనవళ్లు బతికేంత ఆస్తి సొంతమవుతుంది. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఆయన భార్య మెలిండాకు విడాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక జంట చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తిలో సగం వాటా మెలిండాకు పోతుంది. ప్రపంచంలోని అత్యంత రోల్ మోడల్ జంటలలో ఒకరైన బిల్ గేట్స్ మ-మెలిండా ఫ్రెంచ్ గేట్స్ చట్టబద్ధంగా ఒకరి నుండి ఒకరు విడిపోతున్నారు. దంపతుల సామూహిక ఆస్తి నుంచి మెలిండా తీసుకునే  వాటా ఒక పెద్ద మొత్తమే కావడం విశేషం. ఇది ఇప్పటివరకు అత్యంత ఖరీదైన విడాకుల పరిష్కారం అని చెప్పొచ్చు.

27 సంవత్సరాల సుధీర్ఘ వివాహ ప్రయాణానికి బిల్ గేట్స్ -మెలిండా ఫుల్ స్టాప్ పెట్టారు.  ఇప్పటివరకు మెలిండా గేట్స్ కోకాకోలా ఫెమ్సా మరియు గ్రూపో టెలివిసా వంటి సంస్థల్లో వాటా కలిగి ఉన్నారు. కెనడియన్ నేషనల్ రైల్వే కో మరియు ఆటోనేషన్ ఇంక్లలో కూడా ఆమె వాటాలను పొందింది. అన్నింటిని కలిపి ఆమె రూ.15,000 కోట్ల విలువైన స్టాక్ ను పొందింది. ఇది ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం మాత్రమే. ఈ ఒక్క మొత్తంతోనే మెలిండా స్థిరపడినట్లు కనిపిస్తోంది.

బిల్, మెలిండా దంపతులు ‘గేట్స్ ఫౌండేషన్’ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా సేవలందించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి చేసిన ప్రయత్నాలు -లింగ సమానత్వం కోసం సంవత్సరాల్లో 3 లక్షల 75 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం బిల్ గేట్స్ ఆస్తి విలువ 11 లక్షల కోట్లకు పైగానే ఉంది. ఈ జంట దాదాపు 3 దశాబ్దాలుగా వైవాహిక బంధంలో కలిసి నివసిస్తున్నారు. వాషింగ్టన్లోని మదీనాలో అత్యంత ఖరీదైన 66,000 చదరపు అడుగుల భవనంలో వీరు ఉంటున్నారు.
Tags:    
  • Bill Gates 
  • Bill Gates wife 
  • 15000 crore 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS